రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న నలుగురు.. అంతా ఒకే కుటుంబం...

Published : Nov 03, 2020, 02:12 PM ISTUpdated : Nov 03, 2020, 03:11 PM IST
రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న నలుగురు.. అంతా ఒకే కుటుంబం...

సారాంశం

కర్నూలు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు  రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారన్న విషయం మీద పోలీసులు ఆరా తీస్తున్నారు.

పాణ్యం మండలం కొల్లూరులో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాద సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను రైల్వే ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. 

మృతులను రోజాకుంటకు చెందిన గఫూర్ కుటుంబ సభ్యులుగా భావిస్తున్నారు. అతను ఓ బంగారం దుకాణంలో పనిచేసేవాడు. ఆ దుకాణంలో చోరీ జరిగింది. అది అతని మీద పడడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. భార్యాభర్తలతో పాటు వారి ఇద్దరు పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు.

PREV
click me!

Recommended Stories

Vijaysai Reddy Sensational Comments On YS Jagan | Asianet Telugu
చంద్రబాబుపై జగన్ పంచ్ లు EL NINO ఎఫెక్ట్ కాదు ఇది YELLOW NINO ఎఫెక్ట్ | Asianet News Telugu