నిండుకుండలా శ్రీశైలం జలాశయం.. సందర్శకుల తాకిడి, పది కిలోమీటర్ల మేర స్తంభించిన ట్రాఫిక్

By Siva KodatiFirst Published Aug 14, 2022, 4:04 PM IST
Highlights

శ్రీశైలం జలాశయానికి సందర్శకులు పోటెత్తారు. దీంతో శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. శ్రీశైలం నుంచి హటకేశ్వరం వరకు భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. 

గత కొన్నిరోజులుగా మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా కృష్ణా నదీ పోటెత్తుతోన్న సంగతి తెలిసిందే. దీంతో కొన్ని ప్రాంతాల్లో వరదలు చోటు చేసుకుంటున్నాయి. అయితే భారీ వరద కారణంగా శ్రీశైలం జలాశయం నిండు కుండలా మారింది. దీంతో అదికారులు శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి నీటిని దిగువకు పోటెత్తుతున్నారు. ఈ క్రమంలో సందర్శకులు డ్యాం వద్దకు తరలివస్తున్నారు. వరుస సెలవులు రావడంతో పర్యాటకుల తాకిడి పెరిగింది. ఆదివారం శ్రీశైలం ఘాట్ రోడ్డులో దాదాపు పది కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. శ్రీశైలం నుంచి హటకేశ్వరం వరకు భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. 

ఇకపోతే.. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల వరకు విస్తరించి వుంది. అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రాగల 12 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా, తర్వాత 24 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం వుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో వచ్చే 48 గంటల్లో ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని ఐఎండీ తెలిపింది. 

click me!