రఘవీరారెడ్డితో పీసీసీ చీఫ్ శైలజానాథ్ భేటీ.. ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై చర్చలు..

Published : Aug 14, 2022, 01:21 PM IST
రఘవీరారెడ్డితో పీసీసీ చీఫ్ శైలజానాథ్ భేటీ.. ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై చర్చలు..

సారాంశం

కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ పీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘవీరారెడ్డితో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ భేటీ అయ్యారు. ఈ భేటీలో మడకశిర మాజీ ఎమ్మెల్యే కె సుధాకర్‌ కూడా పాల్గొన్నారు. 

కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ పీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘవీరారెడ్డితో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ భేటీ అయ్యారు. ఈ భేటీలో మడకశిర మాజీ ఎమ్మెల్యే కె సుధాకర్‌ కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభత్వాల తీరుకు నిరసనగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న పలు కార్యక్రమాల గురించి చర్చించారు. అలాగే భవిష్యత్తులో పార్టీ తరఫున చేపట్టాల్సిన అంశాలపై కూడా చర్చ చర్చలు జరిపారు. 

ఈ భేటీలో కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చేస్తున్న ప్రజా వ్యతిరేఖ పాలనను ఎండగట్టేందుకు కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన ఆందోళన కార్యక్రమాల గురించి చర్చించినట్టుగా కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే, ఏపీ పునర్విభజన తర్వాత.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. 

రాష్ట్ర విభజన తర్వాత విభాజ్య ఏపీకి మొట్టమొదటి పీసీసీ అధ్యక్షుడిగా రఘువీరారెడ్డి కొనసాగారు. ఆ తర్వాత శైలజానాథ్‌కు ఆ బాధ్యతలు అప్పగించారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలని కాంగ్రెస్ అధిష్టానం చాలాకాలంగా ప్రయత్నిస్తోంది.

PREV
click me!

Recommended Stories

Humanoid Robot Introduced at Visakhapatnam Railway Station | Waltair Division | Asianet News Telugu
Palla Srinivas on Lokesh Birthday: లోకేష్అంటే నమ్మకం.. నిత్యంప్రజల్లోనే ఉంటారు | Asianet News Telugu