
Encouter in Andhra Pradesh : ఆంధ్ర ప్రదేశ్ లో మావోయిస్టుల కదలికలు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే మావోయిస్ట్ కీలక నాయకుడు హిడ్మాతో పాటు మరికొందరు భద్రతా బలగాల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తాజాగా రాష్ట్రంలో మరో ఎన్కౌంటర్ జరిగింది... ఇందులో ఏడుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు.
ఆంధ్ర ప్రదేశ్ ఏజెన్సీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నట్లు భద్రతా బలగాలు గుర్తించాయి. మారేడుమిల్లి ప్రాంతంలో మావోయిస్టులు తారసపడటంతో పరస్పర కాల్పులు మొదలయ్యీయి.. ఈ ఎన్కౌంటర్ లో చత్తీస్ ఘడ్ కు చెందిన మావోలు మరణించినట్లు తెలుస్తోంది. భద్రతా బలగాల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయినవారిలో మావోయిస్ట్ అగ్రనేత దేవ్ జీ కూడా ఉన్నట్లు సమాచారం.
బుధవారం తెల్లవారుజామున మారేడుమిల్లిలో జరిగిన ఎన్కౌంటర్ పై ఇంటెలిజెన్స్ డిజి మహేష్ చంద్ర లడ్డా రియాక్ట్ అయ్యారు. ఏజెన్సీలో నక్సల్, పోలీసులు కు మధ్య కాల్పులు జరిగాయని... ఆరేడుగురు చనిపోయినట్లు సమాచారం ఉందన్నారు. ఈ ఎన్కౌంటర్ గురించి పూర్తి వివరాలు రావాల్సి ఉందన్నారు మహేష్ చంద్ర లడ్డా.