
Maoists : ఆంధ్ర ప్రదేశ్ లో కలకలం రేగింది... ఇప్పటికే మావోయిస్ట్ టాప్ లీడర్ హిడ్మాతో పాటు మరికొందరు పోలీసుల ఎన్కౌంటర్ లో చనిపోయారు. తాజాగా మరికొందరు మావోయిస్టులు విజయవాడలో పట్టుబడ్డారు. ఇలా మావోయిస్టుల కదలికలతో ఏపీలో ఉద్రిక్త వాతావరణ నెలకొంది.
విజయవాడ ఆటో నగర్ లోని ఓ భవనంలో మావోయిస్టులు తలదాచుకున్నట్లు పోలీసులకు సమాచారం అందించింది. దీంతో ఓ భవనాన్ని చుట్టుముట్టి మొత్తం 27 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఆక్టోపస్ తో పాటు స్థానిక పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఎలాంటి హింసకు తావులేకుండా 27 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు. భారీగా ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.
మావోయిస్టులు తలదాచుకున్న భవనాన్ని తనిఖీ చేసేందుకు అందులో నివాసముండే సామాన్య కుటుంబాలను ఖాళీ చేయించారు. ఒకవేళ పోలీసుల కదలికలను గుర్తించి మావోయిస్టులు కాల్పులకు తెగబడినా ఎలాంటి ప్రాణనష్టం లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండానే మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు ఆక్టోపస్, టాస్క్‌ఫోర్స్ ఆఫీసులు. పట్టుబడివారంతా చత్తీస్ ఘడ్ కు చెందినవారిగా గుర్తించారు... వీరంతా హిడ్మా అనుచరులుగా భావిస్తున్నారు. ఓ నలుగురు మావోయిస్ట్ అగ్రనేతలు కూడా పట్టుబడినవారిలో ఉన్నట్లు సమాచారం.