
నిన్న మొన్నటి వరకూ Tomato prices ఆకాశాన్ని తాకాయి. టమాటా రైతుకు లాభాల పంట పండించాయి. కొనడానికి లేకుండా సామాన్యులకు కంట కన్నీరు పెట్టించాయి. అయితే ఇప్పుడు టమాట ధరలు అకస్మాత్తుగా Decline అవుతున్నాయి. నిన్నామొన్నటి వరకు కిలో రూ. 70 నుంచి 80 ఉన్న టమాటా ధర సగానికి సగం పడిపోయింది.
ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో టమోటా పంట అధికంగా పడుతుంది. ముఖ్యంగా Madanapalleలో టమాట అధికంగా పండిస్తారు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటే... ఓకే... లేకపోతే నష్టం వస్తుంది. అయితే గత రెండు మూడు సంవత్సరాల నుంచి ధర ఉన్న సమయంలో Rains, floodsతో పంట చేతికి అంది వచ్చేసరికి ధర లేకపోవడంతో అక్కడ Tomato farmers విపరీతంగా నష్టపోతున్నారు.
ఈ ఏడాది కూడా రైతులు అనేక కష్టనష్టాలకు ఓర్చి టమాటా పంట వేశారు. ఐటీ చిత్తూరు, అనంతపురం, కడప జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు టమాటా పంట దెబ్బతిన్నది. టమాటా ధర పెరిగిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఇతర ప్రాంతాల నుంచి టమాటాలను దిగుమతి చేసి.. పెరిగిన ధరలను నియంత్రించాయి. అయితే ఇప్పుడు చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో టమాటా పంట రైతుల చేతికి వచ్చింది.
అయితే, ఇతర రాష్ట్రాల నుంచి టమాటా దిగుమతి ఉండటంతో ఇప్పుడు స్థానిక టమాట పంటకు ధర వచ్చే పరిస్థితులు లేవు. దీంతో స్థానిక టమాట పంటకు ధరలు లేక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లో టమాటా పంటను పండించిన తాము నష్ట పోతుంటే.. పంట మీద కమిషన్ వ్యాపారులు లాభపడుతున్నారని రైతులు వాపోతున్నారు.
ఆరుగాలం కష్టపడి పండించిన తాము నష్ట పోతుంటే ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుని రైతుబజార్లలో కమీషన్ పద్ధతిలో వ్యాపారం చేసే కమిషన్ దారులు కోట్లకు పడగలెత్తుతున్నారు ఇది ప్రతీసారీ జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నందిగామ రైతు బజార్ లో ఇదే పద్ధతి కొనసాగుతుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
దడ పుట్టిస్తున్న టమాటా, ఉల్లి ధరలు.. కేంద్రం కీలక ప్రకటన.. నెలలోపు గుడ్ న్యూస్..
ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రైతు బజార్లలో దళారుల ప్రమేయంపై చర్యలు తీసుకుని స్థానిక రైతులు పండించే టమోటా పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని ఈ ప్రాంత రైతులు కోరుతున్నారు.
ఇదిలా ఉండగా, గత నెలలో అకస్మాత్తుగా పెరిగిన టమాటా ధరతో సామాన్యుడు అల్లాడిపోయాడు. దీంతో కేంద్ర ప్రభుత్వం టమాటా, ఉల్లి ధరల మీద నవంబర్ 27న కీలక ప్రకటన చేసింది. ఉత్తరాది రాష్ట్రాల్లో దిగుబడి పెరిగి ధరలు తగ్గుతాయని తెలిపింది. డిసెంబర్ 25 నాటికి దేశంలో కిలో టమాటా సగటు ధర రూ. 67 ఉంటుందని, గత ఏడాదితో పోల్చితే 63 శాతం Tomato prices పెరిగిందని తెలిపింది.
అకాల వర్షాల కారనంగా పంటనష్టం, సరఫరాపై ప్రభావంతో టమాటా ధరలు పెరిగాయని పేర్కొంది. ఖరీఫ్, లేట్ ఖరీఫ్ సీజన్ నుంచి 69 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనా వేస్తున్నామని తెలిపింది. నిరుడు ఇదే సమయానికి 70.12 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చిందని, అయితు నిరుడుతో పోల్చితే టమాటా దిగుబడి తగ్గిందని వెల్లడించింది.