మదనపల్లె మార్కెట్‌లో భారీగా తగ్గిన టమాట ధరలు.. కిలో ధర ఎంతంటే..

Published : Aug 10, 2023, 04:25 PM IST
మదనపల్లె మార్కెట్‌లో భారీగా తగ్గిన టమాట ధరలు.. కిలో ధర ఎంతంటే..

సారాంశం

దేశవ్యాప్తంగా  గత కొన్ని వారాలుగా టమాటా ధరలు ఆకాశాన్ని అంటిన సంగతి  తెలిసిందే. పలుచోట్ల కిలో టమాటా ధర రెండు వందల రూపాయలు కూడా క్రాస్ చేసింది. 

దేశవ్యాప్తంగా  గత కొన్ని వారాలుగా టమాటా ధరలు ఆకాశాన్ని అంటిన సంగతి  తెలిసిందే. పలుచోట్ల కిలో టమాటా ధర రెండు వందల రూపాయలు కూడా క్రాస్ చేసింది. అయితే ప్రస్తుతం చాలా చోట్ల టమాటా ధరలు కొంతమేర తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె వ్యవసాయ మార్కెట్‌ యార్డులో టమాట ధరలు భారీగా దిగివచ్చాయి. గత నాలుగు రోజులుగా మార్కెట్‌కు భారీగా పంట వస్తుండటంతో.. క్రమంగా టమాటా ధర దిగివస్తుంది. 

మదనపల్లె టమోటా మార్కెట్ ఫేమస్ అన్న సంగతి తెలిసిందే. అయితే పంట చివరి దశలో ఉన్నందున గత నెలలో ఇక్కడ కూడా టమాటా ధరలు భారీగానే పెరిగాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా.. ఏ గ్రేడ్ టమాటా కిలో ధర గరిష్టంగా  రూ. 196 పలికింది. అయితే ఇప్పుడు భారీగా పంట వస్తుండటంతో.. బుధవారం రోజున మార్కెట్ టమాటా కిలో రూ.80 నుంచి రూ.100 వరకు పలికింది. 

అయితే ఈ రోజు గ్రేడ్ ‘ఏ’ టమాటాలు కిలో రూ. 50 నుంచి రూ. 64 వరకు పలికింది. గ్రేడ్ ‘బి’ రూ. 36 నుంచి రూ. 48 వరకు పలికింది. సగటున కిలోకు రూ. 44 నుంచి రూ.60 మధ్య రైతుల నుంచి వ్యాపారులు టమాటాలు కొనుగోలు చేసినట్లు మార్కెట్ యార్డ్ కార్యదర్శి అభిలాష్ తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు