
కాకినాడ: కాకినాడ బీచ్ వద్ద గురువారంనాడు ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు ప్రేమ జంటను ఆసుపత్రికి తరలించారు.ప్రత్తిపాడు మండలం పోతులూరుకు అరుణ్, శ్రీదేవి కాకినాడ బీచ్ రోడ్డులో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. శ్రీదేవి వివాహితగా చెబుతున్నారు. అయితే వీరిద్దరూ ఎందుకు ఆత్మహత్యాయత్నం చేసుకున్నారనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.
.దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఆత్మహత్యాయత్నం, ఆత్మహత్య ఘటనలు ప్రతి రోజూ చోటు చేసుకుంటున్నాయి. చిన్న చిన్న అంశాలకే ఆత్మహత్యలు చేసుకొంటున్నారు. అయితే సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు . ఆత్మహత్యలు చేసుకోవాలనే ఆలోచన వస్తే వెంటనే మానసిక నిపుణులను కలవాలని కోరుతున్నారు. అయితే ఇలాంటి వారిని గుర్తించి వైద్యుల వద్దకు తీసుకెళ్లాలి. ఆత్మహత్యలకు పాల్పడకుండా జీవితాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.
జీవితంలోని ప్రతి సమస్యకు చావు ఒక్కటే పరిష్కారం కాదు. జీవితంలో మీకెప్పుడైనా మానసిక ఒత్తిడితో బాధపడుతూ సహాయం కావాలనిపిస్తే వెంటనే ఆసరా హెల్ప్ లైన్ ( +91-9820466726 ) కి కాల్ చేయండి లేదా ప్రభుత్వ హెల్ప్ లైన్ కి కాల్ చేయండి. జీవితం చాలా విలువైనది.