మరో మహిళతో వివాహేతర సంబంధం.. ఆమెతో కలిసి భార్యకు చిత్రహింసలు.. సెల్ఫీ వీడియో తీసుకుని వివాహిత బలవన్మరణం...

Published : Feb 10, 2022, 09:50 AM IST
మరో మహిళతో వివాహేతర సంబంధం.. ఆమెతో కలిసి భార్యకు చిత్రహింసలు.. సెల్ఫీ వీడియో తీసుకుని వివాహిత బలవన్మరణం...

సారాంశం

ప్రకాశం జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. భర్త, అతనితో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ పెట్టే చిత్రహింసలు, వేధింపులు తట్టుకోలేక.. ఓ భార్య సెల్ఫీ వీడియో తీసుకుని మరీ ఆత్మహత్య చేసుకుంది.

ప్రకాశం : భర్తతో పాటు అతను Extra Marital Affair పెట్టుకున్న మహిళ, ఆమె కుటుంబ సభ్యులు ఏడుగురు వేధిస్తున్నారంటూ ఓ married woman ఉరి వేసుకుని అర్ధంతరంగా తనువు చాలించింది. మరణించే ముందుసెల్ఫీ వీడియోలో ఆవేదనను వెలిబుచ్చింది. ఈ ఘటన మంగళవారం కంభం పట్టణంలోని కందులాపురం కాలనీలో చోటు చేసుకుంది. పోలీసులు, మృతురాలి సోదరుల కథనం మేరకు..  అర్ధవీడు మండలం గండేపల్లి గ్రామానికి చెందిన దూదేకుల (29)కి పదేళ్ల క్రితం కంభం పట్టణానికి చెందిన నాగూర్ వలితో వివాహం అయ్యింది.  వారికి ముగ్గురు కుమారులు.  

అయితే, నాగూర్ మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయమై భార్యాభర్తల మధ్య తరచూ వివాదం జరుగుతోంది. తరచూ హింసిస్తూ ఉండడంతో భాను పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయినా, నాగూర్ వలి ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో. మనస్తాపం చెందిన భాను ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సంఘటనా స్థలాన్ని ఎస్సై నాగమల్లేశ్వరరావు పరిశీలించారు.

మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. కాగా,  తన సోదరి చావుకు కారణమైన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని మృతురాలి సోదరులు కోరారు. 

ఇదిలా ఉండగా, తెలంగాణ రాష్ట్రం మేడ్చల్ లో వివాహేతర సంబంధంతో భర్తను అతి దారుణంగా హతమార్చిందో భార్య.  వివాహేతర సంబంధం పెట్టుకున్న woman, ప్రియుడి మోజులో పడి లోని ఇంట్లోనే extra marital affair కొనసాగించి భర్తకు పట్టుబడింది. తమ గుట్టు రట్టయ్యిందని భావించి తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న husbandను ప్రియుడితో కలిసి కడతేర్చి కటకటాలపాలైన భార్య, ప్రియుడికి medchal కోర్టు life imprisonment విధిస్తూ జనవరి 25న తీర్పు ఇచ్చింది.

మేడ్చల్ మండలంలోని అక్బర్జాపేట్ గ్రామానికి చెందిన మహంకాళి లక్ష్మి, మహంకాళి కృష్ణ దంపతులు. అదే గ్రామానికి చెందిన గుంటి బాలరాజ్ 2014లో మహంకాళి కృష్ణ ఆటో కొనుగోలు చేశాడు. ఈ క్రమంలోపలు మార్లు వాళ్ళ ఇంటికి వెళ్లడంతో వీరి మధ్య స్నేహం ఏర్పడింది. స్నేహాన్ని అడ్డుపెట్టుకుని తరచూ కృష్ణ ఇంటికి వెళ్లిన గుంటి బాలరాజు అతడి భార్య లక్ష్మితో పరిచయం ఏర్పరుచుకున్నాడు. పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది.

వీరి విషయం తెలియడంతో మహంకాళి కృష్ణ తన భార్యను మందలించాడు.  భర్త  అడ్డు తొలగించుకోవాలని మహాంకాళి లక్ష్మి, ప్రియుడు గుంటి బాలరాజ్ తో కలిసి పథకం వేసుకున్నారు. ఇందులో భాగంగా పలుమార్లు మహంకాళి కృష్ణకు కల్లులో నిద్రమాత్రలు కలిపి తాగించినా మృతుడికి ఏమీ కాలేదు. 2020 ఏప్రిల్ 8న రాత్రి సమయంలో మహంకాళి లక్ష్మి భర్త నిద్ర పోయిన తర్వాత  ప్రియుడు  గుంటి బాలరాజుకు ఫోన్ చేసి ఇంటికి పిలిపించుకుని తమ అక్రమ సంబంధం కొనసాగిస్తుండగా వీరి శబ్దం విని నిద్రలేచిన కృష్ణ వారిని పట్టుకున్నాడు. దీంతో ముందే వేసుకున్న ప్లాన్ ప్రకారం కృష్ణను తీగలతో  మెడను బిగించి హతమార్చారు. హత్య విషయం బయటప పడకుండా కరోనా సమయంలో కల్లు దొరకకపోవడంతో మనస్తాపంతో మరణించినట్లు కట్టుకథ అల్లింది.

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు