టికెట్ ఇస్తే సరి లేదంటే.. వైసీపీని వీడే యోచనలో మరో ఎమ్మెల్యే , టచ్‌లోకి టీడీపీ నేతలు

Siva Kodati |  
Published : Jan 17, 2024, 04:30 PM ISTUpdated : Jan 17, 2024, 04:37 PM IST
టికెట్ ఇస్తే సరి లేదంటే.. వైసీపీని వీడే యోచనలో మరో ఎమ్మెల్యే , టచ్‌లోకి టీడీపీ నేతలు

సారాంశం

వచ్చే ఎన్నికలకు సంబంధించి వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు ఆ పార్టీ నేతల్లో అసంతృప్తికి కారణమవుతున్నాయి. ఏళ్లుగా పార్టీని అంటిపెట్టుకుని వున్న నేతలు సైతం జగన్ వైఖరితో వైసీపీని వీడుతున్నారు. ఈ క్రమంలోనే తిరువూరు ఎమ్మెల్యే రక్షణ నిధి కూడా పార్టీకి రాజీనామా చేసే యోచనలో వున్నారు.

వచ్చే ఎన్నికలకు సంబంధించి వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు ఆ పార్టీ నేతల్లో అసంతృప్తికి కారణమవుతున్నాయి. ఏళ్లుగా పార్టీని అంటిపెట్టుకుని వున్న నేతలు సైతం జగన్ వైఖరితో వైసీపీని వీడుతున్నారు. ఈ క్రమంలోనే తిరువూరు ఎమ్మెల్యే రక్షణ నిధి కూడా పార్టీకి రాజీనామా చేసే యోచనలో వున్నారు. మార్పులు చేర్పుల్లో భాగంగా వచ్చే ఎన్నికల్లో రక్షణ నిధికి టికెట్ వచ్చే అవకాశాలు లేవనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకానొక దశలో సీఎంవో నుంచి వచ్చే ఫోన్ కాల్స్‌ని కూడా ఆయన అటెంప్ట్ చేయడం లేదని టాక్. 

పొలిటికల్‌గా ఈ రేంజ్‌లో హీట్ వున్న దశలో ఎమ్మెల్యే.. తిరువూరుకు దూరంగా తోట్లవల్లూరులో వుంటున్నారు. ఇప్పటికే మూడు జాబితాలు విడుదల చేయగా.. నాల్గో జాబితాపై వైసీపీ కసరత్తు చేస్తోంది. కానీ ఏ ఒక్కదానిలోనూ తన పేరు లేకపోవడంతో రక్షణ నిధి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఫోర్త్ లిస్టులో కనుక పేరు వుంటే సరి, లేనిపక్షంలో రాజీనామా చేయాలని రక్షణ నిధి నిర్ణయానికి వచ్చినట్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇప్పటికు టీడీపీ నేతలు తిరువూరు ఎమ్మెల్యేతో టచ్‌లోకి వెళ్లినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. రక్షణ నిధి తనకు తిరువూరుకు బదులుగా పామర్రు టికెట్ ఆశిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. 

మరోవైపు వైసీపీనీ వీడొద్దంటూ సీఎం వైఎస్ జగన్.. సీనియర్ నేతలను రక్షణ నిధి వద్దకు పంపినట్లుగా తెలుస్తోంది. వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ అయోధ్య రామిరెడ్డి, మర్రి రాజశేఖర్‌లు ఆయనను బుజ్జగించేందుకు చర్యలు చేపట్టినప్పటికీ రక్షణ నిధి మెత్తబడటం లేదు. తిరువూరు నుంచి వరుసగా రెండుసార్లు గెలిచిన తనకు టికెట్ ఇవ్వకపోవడం ఏంటనీ వారిని ఎమ్మెల్యే ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. వైసీపీలో వుండాలంటే తిరువూరు టికెట్ ఇవ్వాల్సిందేనని, లేనిపక్షంలో మరో పార్టీని చూసుకుంటానని రక్షణ నిధి తేల్చిచెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది. మరి ఆయన వైసీపీలోనే వుంటారా , లేక టీడీపీలో చేరుతారా అన్నది త్వరలోనే తేలిపోనుంది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Perni Nani comments on Chandrababu: చంద్రబాబు, పవన్ పేర్ని నాని సెటైర్లు | Asianet News Telugu
IMD Cold Wave Alert : ఈ సీజన్ లోనే కోల్డెస్ట్ 48 గంటలు.. ఈ ప్రాంతాల్లో చలిగాలుల అల్లకల్లోలమే