రేణిగుంటలో రైల్వే ట్రాక్‌పై పేలుడు: విద్రోహ చర్య కాదన్న ఎస్పీ

Siva Kodati |  
Published : Dec 08, 2020, 07:52 PM IST
రేణిగుంటలో రైల్వే ట్రాక్‌పై పేలుడు: విద్రోహ చర్య కాదన్న ఎస్పీ

సారాంశం

రేణిగుంట రైల్వే ట్రాక్‌పై పేలుడు ఘటనపై తిరుపతి అర్బన్ ఎస్పీ  స్పందించారు. పట్టాలపై ఎంఈకేపీ అనే ఎక్స్‌ప్లోజర్‌ను పడేశారని ఎస్పీ తెలిపారు. శశికళ అనే మహిళ గొడుగుతో నొక్కడంతో పేలుడు సంభవించిందన్నారు.

రేణిగుంట రైల్వే ట్రాక్‌పై పేలుడు ఘటనపై తిరుపతి అర్బన్ ఎస్పీ  స్పందించారు. పట్టాలపై ఎంఈకేపీ అనే ఎక్స్‌ప్లోజర్‌ను పడేశారని ఎస్పీ తెలిపారు. శశికళ అనే మహిళ గొడుగుతో నొక్కడంతో పేలుడు సంభవించిందన్నారు. ఎంఈకేపీ అనే పదార్ధాన్ని నీటిని వేడి చేయడానికి వాడతారని ఎస్పీ తెలిపారు. పేలుడు వెనుక తీవ్రవాద కుట్ర లేదని ఆయన స్పష్టం చేశారు. 

కాగా, రేణిగుంట రైల్వే స్టేషన్‌ సమీపంలోని రైలు పట్టాలపై పశువులు కాస్తున్న శశికళ అనే మహిళ ఓ డబ్బాను గుర్తించింది. వెంటనే తన చేతిలో ఉన్న కర్రతో డబ్బాను కదిలించడంతో భారీ శబ్ధంతో పేలుడు సంభవించింది.

పేలుడు ధాటికి మహిళ తీవ్రంగా గాయపడింది. క్షతగాత్రురాలిని 108 వాహనంలో చికిత్స నిమిత్తం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న జీఆర్పీ, రేణిగుంట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు

PREV
click me!

Recommended Stories

Chandrababu, Lokesh కి వెంకన్న ప్రసాదం ఇచ్చిన టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ | Asianet News Telugu
నారావారిపల్లెలో CM Chandrababu Family గంగమ్మ, నాగాలమ్మకు ప్రత్యేక పూజలు | Asianet News Telugu