అచ్చు పుష్ప సినిమానే: బొలేరో వాహనంలో గంజాయి తరలింపు, అరెస్ట్

Published : Jun 05, 2023, 05:20 PM IST
అచ్చు పుష్ప సినిమానే: బొలేరో వాహనంలో గంజాయి తరలింపు, అరెస్ట్

సారాంశం

తిరుపతిలో  బొలోరే వాహనంలో  గంజాయిని తరలిస్తున్న ఎనిమిది  మంది  సభ్యుల ముఠాను   తిరుపతి పోలీసులు అరెస్ట్  చేశారు.   

తిరుపతి: జిల్లాలోని సూళ్లూరుపేటలో  240  కిలోల గంజాయిని పోలీసులు  సోమవారంనాడు  సీజ్  చేశారు. గంజాయిని తరలించేందుకు  బొలెరో  వాహనంలో  మార్పులు  చేర్పులు చేయించారు.  పుష్ప సినిమాలో మాదిరిగా  నిందితులు  బొలెరో వాహనంలో  మార్పులు  చేయించారు.  బొలెరో వాహనంలో  టమాటల కింద  ఏర్పాటు  చేసిన ప్రత్యేక అరలో గంజాయిని తరలిస్తున్నారు.

బొలోరే వాహనంలో  గంజాయి తరలిస్తున్న విషయమై  పోలీసులకు  కచ్చితమైన సమాచారం అందింది.  ఈ సమాచారం ఆధారంగా  పోలీసులు వాహనాలు తనిఖీలు  చేస్తున్న సమయంలో  బొలెరో  వాహనంలో  గంజాయిని  పోలీసులు గుర్తించారు.  గంజాయిని తరలిస్తున్న నిందితులు తమిళనాడు  రాష్ట్రానికి  చెందినవారుగా  గుర్తించారు.

గతంలో  ఎర్ర చందనం  తరలించేందుకు వాహనాాల్లో మార్పులు చేర్పులు  చేసేవారు. కానీ  గంజాయి తరలించేందుకు గాను  బొలేరో  వాహనంలో  ప్రత్యేకంగా అరలు  ఏర్పాటు  చేయడంపై  పోలీసులు  ఆశ్చర్యం  వ్యక్తం  చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

చంద్రబాబు వేసే బిస్కెట్లకు కక్కుర్తి పడకండి | YS Jagan On AP Police | AP Localbody Elections 2026
మాది టైం వస్తది | YS Jagan Sensational Comments On Chandrababuy | AP Local Body Elections 2026