నా సోదరుడు వీరాంజనేయస్వామి భయపడే రకం కాదు... ఎదిరించి పోరాడతాడు..: చంద్రబాబు

By Arun Kumar PFirst Published Jun 5, 2023, 4:45 PM IST
Highlights

కొండెపి నియోజకవర్గంలో ఉద్రిక్తత, టిడిపి ఎమ్మెల్యే డోలా వీరాంజనేయ స్వామి అరెస్ట్ పై చంద్రబాబు నాయుడు స్పందించారు. 

ప్రకాశం : ఎమ్మెల్యే డోలా వీరాంజనేయస్వామి అరెస్ట్ పై టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. గతంలో ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటి అసెంబ్లీలోనే వీరాంజనేయస్వామిపై వైసిపి వాళ్లు దాడి చేసారని... తాజాగా మళ్లీ దాడిచేసి దారుణంగా వ్యవహరించారని అన్నారు. జగన్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారనే ఆంజనేయస్వామిని వైసిపి నాయకులు టార్గెట్ చేసారని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేసారు. 

''కొండపి ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామి గారిపై వైసీపీ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నా. నాడు అసెంబ్లీలో దాడి నుంచి నేటి అక్రమ అరెస్టు వరకు.....ప్రతి చర్య దళిత నాయకుడైన స్వామి గొంతు నొక్కేందుకు ఈ ప్రభుత్వం చేస్తున్న కుట్రే. తమ పట్ల వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న అహంకార ధోరణిని దళిత సమాజం గమనిస్తోంది. మీకు బుద్ది చెప్పడానికి సిద్దం అయ్యింది'' అంటూ వైసిపి నాయకులను చంద్రబాబు హెచ్చరించారు. 

''నా సోదరుడు స్వామి మీ అక్రమ అరెస్టులకు, వేధింపులకు భయపడే నేత కాదు. ఎదిరించి పోరాడే నాయకుడు. పోలీసులు వైసీపీ క్రియాశీల కార్యకర్తల్లా కాకుండా... చట్టబద్దంగా వ్యవహరించాలి. వెంటనే స్వామిని విడుదల చేయాలి'' అంటూ ట్విట్టర్ వేదికన చంద్రబాబు డిమాండ్ చేసారు. 

Read More  బట్టలు చింపేసి మరీ దాడి... దళిత ఎమ్మెల్యేకు ఇంత అవమానమా..: అచ్చెన్నాయుడు సీరియస్

ఇదిలావుంటే మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు కూడా ఎమ్మెల్యే వీరాంజనేయులు అరెస్ట్ పై సీరయస్ అయ్యారు. వైసిపి ప్రభుత్వం దళిత ఎమ్మెల్యేపై కక్షసాధింపుకు పాల్పడుతోందని... పదే పదే ఆయనను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారని అన్నారు. గతంలో రెండు సార్లు అసెంబ్లీ సాక్షిగా స్వామిపై దాడి జరిగిందని... ఇప్పుడు మరోసారి అలాంటి అనభవమే ఎదురయ్యిందంటూ ఆందోళన వ్యక్తం చేసారు. సీఎం జగన్ రెడ్డి డైరెక్షన్ లోనే దళిత ఎమ్మెల్యేపై వరుస దాడులు జరుగుతున్నాయని మాజీ మంత్రి పేర్కొన్నారు. 

ముఖ్యమంత్రి జగన్ కు దళితులంటూ ఎంత చులకనో ఎమ్మెల్యేపై దాడి ఘటనతోనే స్పష్టంగా అర్థమవుతుందని ఆనంద్ బాబు అన్నారు.  దళితులు  ప్రజాప్రతినిధులుగా ఎదగడం జగన్ రెడ్డికి ఏమాత్రం నచ్చదని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలు అవినీతి చేశారని అనడం హస్యాస్పదంగా వుందన్నారు. దళిత ఎమ్మెల్యే డోలా వీరాంజనేయ స్వామి మీద దాడి ,పోలీసుల చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆనంద్ బాబు తెలిపారు. 

ఇక వీరాంజనేయస్వామిపై జరిగిన దాడి దళిత ప్రజాప్రతినిధుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని టిడిపి ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ అన్నారు. ఎస్సీ,ఎస్టీ,బీసీ ఎమ్మెల్యేలను సీఎం జగన్ చులకన భావంతో చూస్తున్నారని అన్నారు. మొన్న దళిత మంత్రి ఆదిమూలపు సురేష్ చేత చొక్కా విడిపించిన జగన్ రెడ్డి నేడు దళిత ఎమ్మెల్యే స్వామి చొక్కా చిప్పించారన్నారు. జగన్ తన స్వార్దం కోసం  దళిత ప్రజాప్రతినిధుల గౌరవాన్ని మంటగలుపుతున్నారని అనగాని ఆరోపించారు. 

తాడేపల్లి ప్యాలెస్ డైరక్షన్ లో స్వామి ఇంటిపై వైసీపీ కార్యకర్తలు దాడికి యత్నించారని అనగాని అన్నారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రజల్లో ఎండగడుతున్నారనే జగన్ రెడ్డి స్వామిపై కక్ష కట్టారన్నారు. జగన్ రెడ్డి కుట్రలను ఎస్సీ, ఎస్టీ,బీసీలంతా గమనిస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ రెడ్డికి బుద్ది చెప్పేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారన్నారు.  దళిత ఎమ్మెల్యే చొక్కా చింపిన వైసీపీ ప్రభుత్వాన్ని తరిమికొట్టేందుకు ప్రజలంతా సిద్దంగా ఉన్నారని ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు.


 

click me!