తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి బుధవారం నాడు కరోనా సోకింది.ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డితో పాటు ఆయన తనయుడు అభినయ్ రెడ్డికి కూడ కరోనా నిర్ధారణ అయింది.
తిరుపతి: తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి బుధవారం నాడు కరోనా సోకింది.ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డితో పాటు ఆయన తనయుడు అభినయ్ రెడ్డికి కూడ కరోనా నిర్ధారణ అయింది.
కరోనా సోకిన విషయం తెలియడంతో ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి ఆయన తనయుడు తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో చేరారు. గత కొన్ని రోజులుగా తనను కలిసిన కార్యకర్తలు, అధికారులు, ప్రజలు కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు.. అంతేకాదు క్వారంటైన్ లోకి వెళ్లాలని ఆయన కోరారు.
undefined
కరోనాపై ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కొంత కాలంగా తిరుపతిలో అవగాహాన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కరోనా సోకిన రోగుల అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
ఈ నెల 23 వ తేదీన నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డికి కరోనా సోకింది. ఆయన ఆసుపత్రిలో చికిత్స తీసుకొంటున్నారు.
ఏపీలో ఇప్పటికే డిప్యూటీ సీఎం అంజద్ బాషాతో పాటు పలువురు ఎమ్మెల్యేలకు కరోనా సోకింది. విజయనగరం జిల్లా ఎస్.కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసులు, గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్య, నెల్లూరు ల్లా సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, కర్నూలు జిల్లా శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, గుంటూరు జిల్లా తెనాలి ఎమ్మెల్యే శివకుమార్, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఈ నెల 6వ తేదీన అరకు ఎమ్మెల్యే ఫాల్గుణ కూడ కరోనా బారినపడిన విషయం తెలిసిందే....