శ్రీశైలం నుండి 40 శాతం నీటి వాడకం: తెలంగాణపై కేఆర్ఎంబీకి ఏపీ మరో లేఖ

By narsimha lodeFirst Published Jun 30, 2021, 11:08 AM IST
Highlights

: శ్రీశైలం ప్రాజెక్టు నుండి తెలంగాణ ప్రభుత్వం జల విద్యుత్ ను ఉత్పత్తి చేయడంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి ఫిర్యాదు చేసింది. 
 

అమరావతి: శ్రీశైలం ప్రాజెక్టు నుండి తెలంగాణ ప్రభుత్వం జల విద్యుత్ ను ఉత్పత్తి చేయడంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి ఫిర్యాదు చేసింది. కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) కి ఏపీ ఇరిగేషన్ ప్రిన్పిపల్ సెక్రటరీ నారాయణరెడ్డి  మరో లేఖ రాశారు. కేఆర్ఎంబీ సెక్రటరీ ఆయన ఈ లేఖ రాశారు. 

also read:ఏపీ, తెలంగాణ మధ్య మరో వివాదం: శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తిపై ఏపీ అభ్యంతరం

జూన్ 1వ తేదీ నుండి శ్రీశైలం ప్రాజెక్టు నుండి తెలంగాణ ప్రభుత్వం నీటిని ఉపయోగించుకొంటుందని ఆ లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్టు నుండి తెలంగాణ 6.9 టీఎంసీల నీటిని ఉపయోగించుకొందని ఆ లేఖలో నారాయణరెడ్డి ఆరోపించారు.ఎగువ నుండి వచ్చిన 17.36 టీఎంసీల నీటిలో 40 శాతం నీటిని తెలంగాణ ఉపయోగించుకొందని ఏపీ ఆ లేఖలో పేర్కొంది.

శ్రీశైలం ప్రాజెక్టు నుండి తెలంగాణ ప్రభుత్వం జల విద్యుత్ ను ఉత్పత్తి చేయడంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి ఫిర్యాదు చేసింది. కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) కి ఏపీ ఇరిగేషన్ ప్రిన్పిపల్ సెక్రటరీ నారాయణరెడ్డి మరో లేఖా రాశారు. pic.twitter.com/kaGHi9IzjF

— Asianetnews Telugu (@AsianetNewsTL)

 

కేఆర్ఎంబీ అనుమతి లేకుండానే శ్రీశైలం నుండి  తెలంగాణ ఈ నీటిని ఉపయోగిస్తోందని ఏపీ  ఆరోపించింది.  ఇదే విషయమై రెండు రోజుల క్రితం  ఏపీ ప్రభుత్వం కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేసింది. ఏపీ ఫిర్యాదు చేసిన వెంటనే  తెలంగాణ వెంటనే విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాలని కేఆర్ఎంబీ ఆదేశించిన విషయం తెలిసిందే.
 

click me!