తిరుపతి జిల్లాలోని వెంకటగిరి రైల్వే స్టేషన్ లో కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలును నిలిపివేశారు.
తిరుపతి: జిల్లాలోని వెంకటగిరి రైల్వే స్టేషన్ లో కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలులో శుక్రవారంనాడు పొగ రావడంతో ప్రయాణీకులు అప్రమత్తమై చైన్ లాగారు. దీంతో రైలును వెంకటగిరి రైల్వే స్టేషన్ లో నిలిపివేశారు.
దేశ వ్యాప్తంగా ఇటీవల కాలంలో రైళ్లలో మంటలు వ్యాపించడం వంటి ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి.రైల్వే అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నా షార్ట్ సర్క్యూట్, నిర్లక్ష్యం వంటి కారణాలతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ నెల 19వ తేదీన బెంగుళూరులోని కెఎస్ఆర్ రైల్వే స్టేషన్ లోని నిలిపి ఉన్న ఉద్యాన్ ఎక్స్ ప్రెస్ లో మంటలు వ్యాపించాయి. ఈ రైలులోని రెండు బోగీల్లో మంటలు చెలరేగి దట్టమైన పొగ వ్యాపించింది. వెంటనే ఫైరింజన్లు మంటలను ఆర్పివేశాయి.
undefined
ఈ ఏడాది జూన్ 6న ఒడిశాలోని సికింద్రాబాద్-అగర్తల ఎక్స్ ప్రెస్ రైలులో మంటలు చెలరేగాయి. బీ5 బోగీలో మంటలు రావడంతో దట్టంగా పొగ వ్యాపించింది. దీంతో ప్రయాణీకులు పరుగులు తీశారు.
ఈ ఏడాది జూన్ 22న లోకమాన్య తిలక్ ఎక్స్ ప్రెస్ రైలులో మంటలు చెలరేగాయి. చెన్నై నుండి ముంబైకి బయలు దేరిన కొద్దిసేపట్లోనే ఈ రైలులో మంటలు వ్యాపించాయి. దీంతో లోక్ పైలెట్ రైలును నిలిపివేశాడు. మంటలను ఆర్పిన తర్వాత రైలును ముంబైకి పంపించారు.
ఈ ఏడాది జూలై 7వ తేదీన ఫలక్‌నుమా ఎక్స్ ప్రెస్ రైలులో మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఏడు బోగీలు అగ్నికి ఆహుతయ్యాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలోని పగిడిపల్లి-బొమ్మాయిపల్లి మధ్య ఈ ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంపై విచారణకు రైల్వే శాఖ ఆదేశాలు జారీ చేసింది.