Telugu Akademi : కమీషన్ల ఆశతో కేడీలుగా మారిన మేనేజర్లు...!

By AN Telugu  |  First Published Oct 23, 2021, 9:05 AM IST

 ఈ ముఠాతో పలు banks managers  చేతులు కలిపినట్లు తాజాగా బయటపడింది.  కమీషన్లకు కక్కుర్తిపడి సొంత ఇంటి ఊచల లెక్కలు దొంగలకు  వీరే చెప్పేసి నట్లు తేలిపోయింది.  లేని వడ్డీరేట్లను ఉన్నట్టుగా చూపించి కొటేషన్లు ఇవ్వడం ద్వారా తెలుగు అకాడమీ ముఠా చేసిన ప్రతి మోసంలోనూ సహకరించారని CCS police నిర్ధారించారు.


విజయవాడ :  రంగాలు వేరు అయినా అంతరంగాలు ఒకటయ్యాయి. చైన్ మాదిరిగా ఒకరితో ఒకరికి స్నేహం కుదిరింది.  అందరూ కలిసి ప్రభుత్వ కార్పొరేషన్లను ముంచేశారు. కోట్లాది రూపాయలను కొల్లగొట్టారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ  కలకలం రేపుతున్న Telugu Akademi FD scam భాగోతం స్థూలంగా ఇదే. 

అయితే, ఈ ముఠాతో పలు banks managers  చేతులు కలిపినట్లు తాజాగా బయటపడింది.  కమీషన్లకు కక్కుర్తిపడి సొంత ఇంటి ఊచల లెక్కలు దొంగలకు  వీరే చెప్పేసి నట్లు తేలిపోయింది.  లేని వడ్డీరేట్లను ఉన్నట్టుగా చూపించి కొటేషన్లు ఇవ్వడం ద్వారా తెలుగు అకాడమీ ముఠా చేసిన ప్రతి మోసంలోనూ సహకరించారని CCS police నిర్ధారించారు.

Latest Videos

undefined

ఈ కేసులో మాజీ మేనేజర్ గుత్తిందీవి సందీప్ కుమార్ ను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. మరో బ్యాంకు మేనేజర్ కోసం గాలిస్తున్నారు.  ఈ వివరాలను విజయవాడ తూర్పు మండలం ఉప కమిషనర్ జి హర్షవర్ధన్ రాజు,  సిసిఎస్ సహాయ కమిషనర్  కె శ్రీనివాసరావు వెల్లడించారు.

పోలీసుల కథనం ప్రకారం.. తెలుగు అకాడమీ  సహా పలు ప్రభుత్వ సంస్థలకు చెందిన  ఫిక్స్డ్ డిపాజిట్లను వేర్వేరు బ్యాంకుల నుంచి మాయం చేయడమే ‘తెలుగు అకాడమీ’  కుంభకోణంగా వెలుగులోకి వచ్చింది.  ఈ స్కాం తో ప్రమేయం ఉన్న మరీదు వెంకటేశ్వర రావు అలియాస్ వెంకటేష్ అలియాస్ రాజేష్, యెహాను రాజు  మంచి స్నేహితులు.  

Telugu Akademi : ఎఫ్ డిల గోల్ మాల్ వ్యవహారంలో మరొకరి అరెస్ట్

ముందుగా ఈ gang వేసుకున్న పథకం ప్రకారం విజయవాడ భవానిపురం ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ మేనేజర్ Guthindivi Sandeep Kumar ను  యెహాను రాజు కలిశాడు.

‘వివిధ government corporationsలో ఉన్న నిధులను ఐఓబి లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయిస్తాం,  దానికోసం ఇతర బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీ ఇస్తున్నట్లు కొటేషన్ ఇప్పించండి.  ఇలా చేసినందుకు ప్రత్యేకంగా కమిషన్ ఇప్పిస్తాను’  అని ఆఫర్ ఇచ్చాడు. అందుకు అంగీకరించిన సందీప్ కుమార్ తన బ్యాంకులో  5.5 శాతం వడ్డీ ఇస్తున్నట్లు fake quotation ఇచ్చారు.

ఆ కొటేషన్ తో  యెహాను రాజు,  రాజేష్ తదితర విజయవాడ ఆటో నగర్ లో ఉన్న రాష్ట్ర గిడ్డంగుల సంస్థ అధికారుల వద్దకు వెళ్లారు. బ్యాంకు ప్రతినిధులుగా తమను తాము పరిచయం చేసుకున్నారు.  ఆ తర్వాత గుత్తిందీవి సందీప్ కుమార్ తో   సమావేశాన్ని ఏర్పాటు చేశారు. IOB లో  నిధులను Fixed deposit చేస్తే  అధిక వడ్డీ ఇప్పిస్తానని  సందీప్ చెప్పగా.. ఇందుకు గిడ్డంగుల సంస్థ అధికారులు గత డిసెంబర్లో అంగీకరించారు.

ఈ క్రమంలో ఐఓబి లో నకిలీ Current account ను ముఠా తెరిచింది. తాము గిడ్డంగుల  సంస్థ  సిబ్బంది అని,  నగదు లావాదేవీలు  చూసుకుంటామని  బ్యాంకు సిబ్బందిని నమ్మించింది..  అంగీకరించినట్టుగానే గిడ్డంగుల సంస్థ అధికారులు అధికార ధ్రువీకరణ పత్రాలతో పాటు రూ.  9.6 కోట్లకు చెక్కును యోహానుకు  ఇచ్చారు.

ఏపీ ఫిక్స్‌డ్ డిపాజిట్ల స్కామ్: ఇద్దరు అరెస్ట్.. నిందితుల్లో ఒకరు ఐవోబీ మాజీ మేనేజర్

 అందులో రూ.  2.9 కోట్ల ను  వాస్తవంగా ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు.  మిగిలిన నిధులను మాత్రం  మూడు దఫాలుగా  తమకు చెందిన  కరెంటు ఖాతాలో జమ చేయించుకున్నారు.  ఆ తర్వాత మేనేజర్ వద్ద కూర్చుని ఈ నిధులను తమ సొంత ఖాతాలోకి మలచుకున్నారు.  ఈ విధంగా రూ. 3.7 కోట్లను ఒకసారి, రూ. 4 కోట్లను మరోసారి, రూ.  1.9 కోట్లు ఇంకోసారి ఖాతాలకు మళ్లించారు.

నకిలీ బాండ్లతో బ్యాండ్…

విజయవాడ పరిధిలోని  ఆత్కూరులో ఉన్న  సప్తగిరి గ్రామీణ బ్యాంకు మేనేజర్ వెంకటరామిరెడ్డిని యోహాను రాజు  కలిశాడు.  ఆఫర్ చేసిన Commissionకు ఆయన లొంగిపోయారు.  సప్తగిరి లో ఎక్కువ వడ్డీ ఇప్పిస్తానని  కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోయర్స్  కార్పొరేషన్  అధికారులను అతను ఒప్పించాడు.

వారు అంగీకరించడంతో  వెంకట్ రామ్ రెడ్డి తో సమావేశం ఏర్పాటు చేయించాడు.  అధికార ధ్రువీకరణ పత్రాలతో పాటు.. రూ. ఐదు కోట్ల చెక్కును యేహానుకు  కార్పొరేషన్ అధికారులు ఇచ్చారు.  ఈ చెక్కును ఎఫ్‌డీగా చూపించినట్టే చూపించి నకిలీ ధ్రువీకరణ పత్రాలతో విత్‌డ్రా చేశారు.

ముఠాలోని కృష్ణారెడ్డి, పద్మనాభం, మదన్ లు  విడుదలకు సంబంధించి బ్యాంకులకు సమర్పించాల్సిన నకిలీ డాక్యుమెంట్లను తయారు చేయడంలో సిద్ధహస్తులు. బ్యాంకులు ఇచ్చే బాండ్లు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా తయారు చేసి యెహాను, సాయికుమార్‌కు ఇచ్చారు.  ఆ తర్వాత వారు పని మొత్తం పూర్తి చేసేవారు.

తమకు సహకరించినందుకు ఈ ముఠా సభ్యులు  బ్యాంకు మేనేజర్ లకు భారీగా కమిషన్లు ఇచ్చేవారని సీసీఎస్ పోలీసులు గుర్తించారు.  సందీప్ కుమార్, యెహానులను  అరెస్టు చేశారు. పరారీలో ఉన్న వెంకటరామిరెడ్డి  ప్రస్తుతం విజయవాడ తాడిగడప  సప్తగిరి శాఖ  మేనేజర్  కోసం  గాలిస్తున్నామని  తూర్పు ఉప కమిషనర్  హర్షవర్ధన్ తెలిపారు. సందీప్ నుంచి రూ. 11.50 లక్షల నగదు,  యెహానురాజు సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. 

click me!