చెన్నై, బెంగళూరులో ఎస్వీబీసీ కార్యాలయాలు..!

Published : Mar 25, 2022, 01:23 PM IST
చెన్నై, బెంగళూరులో ఎస్వీబీసీ కార్యాలయాలు..!

సారాంశం

శ్రీ వెంకటేశ్వర భక్తిచానల్ కార్యాలంలో గురువారం టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన ఎస్వీబీసీ పాలక మండలి సమావేశంలో జరిగింది. ఈ సమావేశంలో  ఈ తీర్మానం తీసుకున్నారు.

తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి ఆల‌య ప్ర‌సారాల కోసం ఏర్పాటు చేసిన శ్రీవేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛానెల్ ఆఫీసులను చెన్నై, బెంగ‌ళూరులో ఏర్పాటు కానున్నాయి. దీనికి సంబంధించి ఇవాళ(గురువారం) టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన శ్రీవేంక‌టేశ్వ‌ర భక్తి ఛానెల్ పాల‌క మండ‌లి స‌మావేశం తీర్మానించింది.

శ్రీ వెంకటేశ్వర భక్తిచానల్ కార్యాలంలో గురువారం టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన ఎస్వీబీసీ పాలక మండలి సమావేశంలో జరిగింది. ఈ సమావేశంలో  ఈ తీర్మానం తీసుకున్నారు.

ఎస్వీబీసీ గత ఏడాది ప్రారంభించిన తమిళ, కన్నడ, హిందీ ఛానళ్లకు విశేష స్పందన లభిస్తంోదని అధికారులు వివరించారు. తమిళ, కన్నడ కార్యక్రమాలను మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి చెన్న, బెంగళూరు నగరాల్లో కార్యాలయాలు ఏర్పాటు చేసి స్థానికంగానే కార్యక్రమాల చిత్రీకరణ చేయాలని నిర్ణయించారు.

శ్రీవేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛానెల్ తెలుగు ప్ర‌సారాల‌తో పాటు.. ఇటీవ‌లే క‌న్న‌డ‌, త‌మిళ భాష‌ల్లోనూ ప్ర‌సారాల‌ను మొద‌లుపెట్టింది. ఆయా ప్రాంతీయ భాష‌ల‌కు చెందిన భ‌క్తుల్లోకి ఛానెల్ ప్ర‌సారాల‌ను మ‌రింత విస్తృతంగా తీసుకుని వెళ్లేందుకే త‌మిళ‌, క‌న్న‌డ ఛానెళ్ల ప్ర‌సారాల‌కు సంబంధించిన ఆఫీసులను చెన్నై, బెంగ‌ళూరుల్లో ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

PREV
click me!

Recommended Stories

మహిళా రిజర్వేషన్ బిల్లు పై Pamula Pushpa Srivani Reaction | Women Reservation | Asianet News Telugu
పవన్‌ కళ్యాణ్‌.. 30వేల మంది మహిళలు ఏమయ్యారు? Vidadala Rajini Comments| Asianet News Telugu