Tirumala : తిరుమల వెళ్తున్నారా? అయితే, ముందు ఈ విష‌యాలు తెలుసుకోండి.. !

By Mahesh Rajamoni  |  First Published Apr 14, 2023, 1:16 PM IST

Tirumala : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానికి భ‌క్తులు పొటెత్తుతున్నారు. వీకెండ్ కావ‌డంతో భ‌క్తులు ఎక్కువ‌గా వ‌చ్చే అవ‌కాశ‌ముంద‌ని దేవాల‌య వ‌ర్గాలు భావిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల దివ్యదర్శనం టోకెన్ల జారీలో చేసిన మార్పుల‌ను భ‌క్తులు గ‌మ‌నించాల‌ని టీటీడీ సూచించింది. 
 


Tirumala Tirupati Devasthanam (TTD): తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానికి భ‌క్తులు పొటెత్తుతున్నారు. వీకెండ్ కావ‌డంతో భ‌క్తులు ఎక్కువ‌గా వ‌చ్చే అవ‌కాశ‌ముంద‌ని దేవాల‌య వ‌ర్గాలు భావిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల దివ్యదర్శనం టోకెన్లు జారీలో చేసిన మార్పుల‌ను భ‌క్తులు గ‌మ‌నించాల‌ని టీటీడీ సూచించింది. 

వివ‌రాల్లోకెళ్తే.. క‌లియుగ దైవం తిరుమ‌ల తిరుప‌తి శ్రీ వేంక‌టేశ్వ‌రున్ని దర్శించుకోవ‌డానికి వ‌స్తున్న భ‌క్తుల సంఖ్య క్ర‌మంగా పెరుగుతోంది. ఈ క్ర‌మంలోనే తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం భ‌క్తుల సౌక‌ర్యం కోసం ప‌లు మార్పులు చేస్తోంది. దీనిలో భాగంగా దివ్యదర్శనం టోకెన్లు జారీ కేంద్రాన్ని శుక్ర‌వారం నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మార్పులు చేసింది. 

Latest Videos

undefined

తిరుమలకు నడిచి వెళ్లే భక్తులకి ఇచ్చే దివ్యదర్శనం టోకెన్లు జారీ కేంద్రాన్ని మార్చింది. ఇప్ప‌టివరకూ కాలిబాట, గాలిగోపురం వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేశారు. అయితే, శుక్ర‌వారం నుంచి అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్‌లో దివ్యదర్శనం టోకెన్లు జారీ చేయనున్న‌ట్టు సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి. అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్యదర్శనం టోకెన్ తీసుకున్నవారు.. అలిపిరి నుంచి నడిచి వెళ్లి గాలిగోపురం వద్ద తనిఖీ కేంద్రంలో ముద్ర వేయించుకోవాల‌ని తెలిపారు. ఇలా చేస్తేనే దర్శనానికి అనుమతి లభిస్తుందని టీటీడీ తెలిపింది.

కాగా, క‌రోనా కార‌ణంగా మూడేళ్లుగా దివ్య‌ద‌ర్శ‌నం టోకెన్ల జారీ నిలిపివేయ‌గా,  తిరుమల కాలి నడకమార్గాల్లో దివ్యదర్శనం టోకెన్ల జారీ ఇటీవలే మ‌ళ్లీ ప్రారంభించారు. అలిపిరి నడక మార్గంలో గాలిగోపురం వద్ద రోజుకు 10వేలు టోకెన్లు అందుబాటులో ఉండనున్నాయి. అలాగే, శ్రీవారి మెట్టు మార్గంలో 1250వ మెట్టు వ‌ద్ద రోజుకు 5వేల దివ్యదర్శనం టోకెన్లను ల‌భించ‌నున్నాయ‌ని తిరుమల అధికారులు తెలిపారు. ఇక  శ్రీవారి మెట్టు మార్గంలో మాత్రం యథావిధంగా దివ్యదర్శనం టోకెన్లను ఇవ్వ‌నున్నారు. అలాగే, ఉచిత దర్శనం టోకెన్లను బస్టాండ్ సమీపంలోని శ్రీనివాసము, రైల్వే స్టేషన్ సమీపంలోని గోవిందరాజస్వామి సత్రాల‌లో ఇవ్వ‌నున్నారు.

click me!