విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేసీఆర్ సర్కార్ తప్పుడు ప్రచారం: జీవీఎల్

By narsimha lode  |  First Published Apr 14, 2023, 12:49 PM IST

విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో  కేసీఆర్ సర్కార్  చేస్తున్న  ప్రచారంపై  బీజేపీ ఎంపీ  జీవీఎల్ నరసింహరావు  మండిపడ్డారు.  కేసీఆర్  సర్కార్  తప్పుడు  ప్రచారం  చేసుకుందన్నారు. 


విశాఖపట్టణం: విశాఖ స్టీల్ ప్లాంట్‌నే  కొనుగోలు  చేస్తున్నట్టుగా  కేసీఆర్  ప్రచారం  చేసుకున్నారని  బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు  విమర్శించారు.  శుక్రవారంనాడు  విశాఖపట్టణంలో  బీజేపీ ఎంపీ  జీవీఎల్ నరసింహరావు మీడియాతో మాట్లాడారు.

విశాఖ స్టీల్  ప్లాంట్ ప్రైవేటీకరణ ఇప్పట్లో జరగదన్నారు. ,  అందరి మద్దతు లేకుండా  ముందడుగు  పడదన్నారు. .  విశాఖ స్టీల్  ప్లాంట్ ఈఓఐ విషయంలో  కేసీఆర్  తప్పుడు  ప్రచారం  చేసుకుంటున్నారన్నారు.  విశాఖ స్టీల్  ప్లాంట్  లో  స్టీల్  కొనుగోలు కు  వచ్చి  ప్లాంట్  కొనుగోలు  చేస్తున్నామని  కేసీఆర్ తప్పుడు  ప్రచారం  చేసుకున్నారన్నారు.
ఎక్స్ ప్రెషన్  ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది  ప్రైవేటీకరణలో  తొలి అడుగు అని  ఆయన  చెప్పారు.  ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్  అంటే సినిమా టిక్కెట్టా అని   అడిగారు. 

Latest Videos

undefined

విశాఖ స్టీల్ ప్లాంట్  విషయమై  తాను  అవకాశం దొరికినప్పుడల్లా  కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి  నిర్మలా సీతారామన్ తో  చర్చించేవాడినన్నారు.  విశాఖ స్టీల్  ప్లాంట్  ఎండీ అతుల్ భట్ తో  ఇాళ  తాను  చర్చించినట్టుగా  జీవీఎల్ నరసింహరావు  చెప్పారు.

విశాఖ స్టీల్   ప్లాంట్  మూల ధన వ్యయం   సమకూర్చుకొనేందుకు గాను  ఈఓఐు  పిలిచింది.   ఈ విషయమై  బిడ్డింగ్ లో  పాల్గొనేందుకు  ఈ నెల  15  ఆఖరు తేదీ.  ఆరు ప్రైవేట్ సంస్థలతో పాటు  తెలంగాణకు  చెందిన సింగరేణి సంస్థ  ఈఒఐలో  సాధ్యాసాధ్యాల పరిశీలనకు  విశాఖపట్టణం వెళ్లింది.  రెండు  రోజులుగా  విశాఖ స్టీల్  ప్లాంట్  అధికారులతో   సింగరేణి అధికారులు  చర్చించారు.

also read:విశాఖ స్టీల్ ప్లాంట్: యాజమాన్యంతో కేంద్ర మంత్రి ఫగ్గన్ సింగ్ భేటీ

ఈ నెల  13న  విశాఖ పట్టణం  వచ్చిన  కేంద్ర ఉక్కు  శాఖ సహాయమంత్రి  ఫగ్గన్ సింగ్  ప్రైవేటీకరణపై  ముందుకు వెళ్లబోమని ప్రకటించారు.  కేసీఆర్ దెబ్బకే  కేంద్రం దిగొచ్చిందని  బీఆర్ఎస్ నేతలు తెలంగాణ  మంత్రులు ప్రకటించారు.  ఈ ప్రకటనపై  వైసీపీ నేతలు మండిపడ్డారు.  తెలంగాణలో  కేంద్రం దిగిరాలేదా  అని సెటైర్లు  వేశారు.
 

click me!