తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్: ప్రతి రోజూ 13 వేల మందికి దర్శనం

Published : Sep 02, 2020, 04:15 PM IST
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్: ప్రతి రోజూ 13 వేల మందికి దర్శనం

సారాంశం

తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్ల కోటాను టీటీడీ పెంచింది. ఇవాళ్టి నుండి మరో వెయ్యి టిక్కెట్లను పెంచింది. పెంచిన వెయ్యి టిక్కెట్లను ఆన్ లైన్ లోనే విక్రయించనున్నారు. దీంతో ప్రతి రోజూ 13 వేల మందికి శ్రీవారి దర్శనం దక్కనుంది.

తిరుమల: తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్ల కోటాను టీటీడీ పెంచింది. ఇవాళ్టి నుండి మరో వెయ్యి టిక్కెట్లను పెంచింది. పెంచిన వెయ్యి టిక్కెట్లను ఆన్ లైన్ లోనే విక్రయించనున్నారు. దీంతో ప్రతి రోజూ 13 వేల మందికి శ్రీవారి దర్శనం దక్కనుంది.

ఈ ఏడాది ఆగష్టు 27వ తేదీ నుండి భక్తులకు శ్రీవారి సర్వదర్శనం కల్పించారు.ఆఫ్ లైన్ లో ప్రతి రోజూ  3 వేల టిక్కెట్లను భక్తులకు అందిస్తున్నారు. తాజాగా టీటీడీ తీసుకొన్న నిర్ణయంతో ప్రతి రోజూ ఆన్ లైన్ లో 10వేల టిక్కెట్లు భక్తులకు అందుబాటులో ఉండనున్నాయి. 

also read:రేపటి నుండి భక్తులకు శ్రీవారి సర్వదర్శనం: టీటీడీ గ్రీన్ సిగ్నల్

కరోనా నేపథ్యంలో ఈ ఏడాది మార్చి 20వ తేదీ నుండి తిరుపతిలో భక్తులకు దర్శనాలను నిలిపివేశారు. ఈ ఏడాది మే 8వ తేదీ నుండి భక్తులకు దర్శనాలకు అనుమతి ఇచ్చారు.కరోనాను కట్టడి చేసేందుకు జిల్లా యంత్రాంగం కఠినంగా ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షల నేపథ్యంలో కరోనాను అదుపులోకి తీసుకొచ్చినట్టుగా జిల్లా అధికారులు ప్రకటించారు. కరోనా పూర్తిగా అదుపులోకి వస్తే మరింత మందికి స్వామిని దర్శించుకొనేందుకు అవకాశం లభించనుంది.

 


 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Pressmeet: పోలవరం ప్రాజెక్ట్ పనుల పైసీఎం చంద్రబాబు కీలక ప్రెస్ మీట్ | Asianet Telugu
పోలవరం ప్రాజెక్ట్ పనులు పరిశీలించిన సీఎం చంద్రబాబు | CM Chandrababu Reviews Polavaram Project Works