తిరుమల సర్క్యులర్ దెబ్బ: శ్రీలక్ష్మిని బదిలీ చేసిన బాబు ప్రభుత్వం

First Published May 10, 2018, 5:51 PM IST
Highlights

పురావస్తు శాఖ అమరావతి సర్క్యులర్ సూపరింటిండెంట్ శ్రీలక్ష్మిపై తిరుమల దెబ్బ పడింది. 

అమరావతి: పురావస్తు శాఖ అమరావతి సర్క్యులర్ సూపరింటిండెంట్ శ్రీలక్ష్మిపై తిరుమల దెబ్బ పడింది. ఆమెను బదిలీ చేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. 

తిరుమల తిరుపతి ఆలయాలను పురావస్తు శాఖ పరిధిలోకి తీసుకురావాలని శ్రీలక్ష్మి సర్క్యులర్ జారీ చేశారు. దాంతో తీవ్ర వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. భక్తుల నుంచి వచ్చిన నిరసనతో ఆమెను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

గతంలో ఆమె జారీ చేసిన సర్క్యులర్ తో తమకు ఏ విధమైన సంబంధం లేదని పురావస్తు శాఖ స్పష్టం చేసింది. తిరుమల శ్రీవారి ఆలయాన్ని రక్షిత సంపదగా గుర్తించాలని ఈ నెల 5వ తేదీన పురావస్తు శాఖ సర్క్యులర్ జారీ చేసింది. 

అందుకు తమ ప్రతినిధులకు సహకరించాలని పురావస్తు శాఖ నుంచి టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ కు లేఖ వచ్చింది. అయితే, తిరుమల ఆలయాలను పురావస్తు శాఖకు అప్పగించే ప్రసక్తి లేదని ఆయన స్ప,్టం చేశారు. 

తీవ్రమైన వ్యతిరేకత రావడంతో ఆ లేఖను ఉపసంహరించుకుంటున్నట్లు భారత పురావస్తు శాఖ అధికారి శ్రీలక్ష్మి ఆ తర్వాత చెప్పారు. 

click me!