అన్ లైన్ లో శ్రీవారి అర్జిత సేవ టికెట్లు

Published : Nov 04, 2016, 07:21 AM ISTUpdated : Mar 25, 2018, 11:47 PM IST
అన్ లైన్ లో శ్రీవారి అర్జిత సేవ టికెట్లు

సారాంశం

 ఆన్ లైన్ లో శ్రీవారి అర్జత సేవా టికెట్లు.. 2017 జనవరి, ఫిబ్రవరి నెలలకు 1,00,147 అర్జిత సేవా టిక్కెట్లు

తిరుమల శ్రీవారి అర్జిత సేవా టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) శుక్రవారం విడుదల చేసింది. ఉదయం 11 గంటల నుంచి టీటీడీ వెబ్‌సైట్‌లో టిక్కెట్లను అందుబాటులో ఉంటాయి. 2017 జనవరి, ఫిబ్రవరి నెలలకు 1,00,147 అర్జిత సేవా టిక్కెట్లు ఆన్లైన్ లో భక్తులకు అందుబాటులో ఉంటాయి.  ఈ విషయాన్ని టిటిడి ఇవొ  డాక్టర్ సాంబశివరావు వెల్లడించారు.

 

 నిత్య సేవలతో పాటు, వారపు సేవా టిక్కెట్లను భక్తులు వెబ్‌సైట్ ద్వారా కొనవచ్చు. టికెట్ల వివరాలు: అర్చన రు 190,తోమల సేవ 190,సుప్రభాతం 9,073 ,అష్టదళపాదపద్మారాధన 160, విశేషపూజ 3,200, నిజపాదదర్శనం 2,604,కల్యాణోత్సవం 20,500,వసంతోత్సవం 22,360,సహస్రదీపాలంకర సేవ 25,175,వూంజల్‌సేవ 5,300,అర్జిత బ్రహ్మోత్సవం 11,395 .

 

ఇది ఇలా ఉంటే, మన గుడి కార్యక్రమం పూజా సామగ్రిని శ్రీవారి పాదల చెంత ఉంచి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల్లోని 12వేల ఆలయాల్లో ఈనెల 14న 8వ విడత మనగుడి కార్యక్రమం ప్రారంభం నిర్వహించాలని టిటిడిబోర్డు నిర్ణయించిన సంగతి తెలిసిందే.

 

మనగుడి కార్యక్రమంలో భాగంగా శివాలయాల్లో ప్రత్యేక పూజలు, కంకణ ప్రసాదం వితరణ జరుగుతంది.  ఆలయాలలో పూజా కార్యక్రమాలను పునరుధ్దించేందుకు  2014లో మొదలయింది. రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న దాదాపు 60 వేల చిన్న  పెద్ద దేవాలయాలన్నింటా క్రమంగా మనగుడి కార్యక్రమం నిర్వహించాలని టిడిడి నిర్ణయించింది. చాలా కాలంగా వాటిలో ధూపదీపనైవేద్యాలనేవి  ఉండటం లేదు. మరుగున పడిన అచారాన్ని పునరుద్ధరించేందుకు   ఈ కార్యక్రమం ఉద్దేశించారు.  దేవాదాయశాఖ, తితిదే సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాయి.

నవంబర్ 7న పుష్ప యాగం

నవంబర్ ఏడో తేదీన శ్రీ వారి సన్నిధిలో  పుష్పయాగం నిర్వహిస్తున్నారు. ఈ యాగాన్ని  వార్షిక  కార్తీకంలో బ్రహ్మోత్సవాలు పూర్తయ్యాక శ్రావణ నక్షత్రం అరంభం నాడు  నిర్వహిస్తారు. ఈ సందర్భంగా మలయప్పస్వామి అటు ఇటు దేవేరులతో పుష్ప స్నానమాచరిస్తారు.

ఈ కార్యక్రమంలో   ఏడు టన్నుల 18 రకాల పవిత్ర పుష్పాలను  వినియోగిస్తారు.

ఈ పుష్ఫ స్నానం 15 శతాబ్దంలో  అమలులో ఉండింది.  1980లో టిటిడి  ఈ కార్యక్రమాన్ని పునరుద్ధరించింది. కన్నల పండుగ లాంటి ఈ కార్యక్రమం ఏడో తేదీ మధ్యాహ్నం 1 గంట – 5 గంటల మధ్య జరుగుతుంది.

ఈ కార్యక్రమం వల్ల ఆరోజు ఎలాంటి అర్జిత సేవలుండవు.

 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?