టిక్ టాక్ స్టార్ రఫీ ఆత్మహత్య..!

Published : Jan 23, 2021, 01:20 PM ISTUpdated : Jan 23, 2021, 01:25 PM IST
టిక్ టాక్ స్టార్ రఫీ ఆత్మహత్య..!

సారాంశం

టిక్ టాక్ కారణంగా మన దేశంలో చాలా మంది నార్మల్ పీపుల్ కూడా సెలబ్రెటీలుగా మారారు. పాటలకు డ్యాన్స్ లు వేస్తూ.. సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ని పెంచుకొని  ఆ తర్వాత సినిమాల్లో ఛాన్స్ లు కొట్టేసిన వారు కూడా ఉన్నారు.

భారత్ లో టిక్ టాక్ కి ఎంత క్రేజ్ వచ్చిందో అందరికీ తెలిసిందే. ఈ మధ్య దీనిని బ్యాన్ చేశారు కానీ.. ఈ టిక్ టాక్ కారణంగా మన దేశంలో చాలా మంది నార్మల్ పీపుల్ కూడా సెలబ్రెటీలుగా మారారు. పాటలకు డ్యాన్స్ లు వేస్తూ.. సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ని పెంచుకొని  ఆ తర్వాత సినిమాల్లో ఛాన్స్ లు కొట్టేసిన వారు కూడా ఉన్నారు.

కాగా.. ఇలా టిక్ టాక్ లతో ఫేమ్ తెచ్చుకున్న ఓ నెల్లూరు కుర్రాడు అనూహ్యంగా ఆత్మహత్య చేసుకున్నాడు. రెండు రోజుల క్రితం రఫీని కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేసి.. చిత్రహింసలు పెట్టినట్టు పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. తమపై పోలీసులకు పిర్యాదు చేశాడని.. బట్టలు ఊడదీసి కొట్టి, వీడియోలు తీసి.. యూ ట్యూబ్‌లో పెడతామని సదరు వ్యక్తుల నుంచి రఫీకి బెదిరింపులు వచ్చాయి. అయితే పోలీసుల నుంచి ఎలాంటి స్పందనలేకపోవడంతో... మనోవ్యధతోనే రఫీ ఆత్మహత్య చేసుకున్నాడని బంధువులు ఆరోపిస్తున్నారు. 

కాగా.. రఫీ ఆత్మహత్య ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది. సరిగ్గా సంవత్సరన్న  క్రితం రఫీ చావు అంచులదాకా వెళ్లి బతికి బయటపడ్డాడు.

 

సోనిక అనే యువతితో కలిసి రోడ్డుపై బైక్ జర్నీ చేస్తూ.. రఫీ యాక్సిడెంట్ కి గురయ్యాడు. ఆ ప్రమాదంలో సోనిక ప్రాణాలు కోల్పోగా... రఫీ తీవ్రగాయాలపాలై కోమాలో కి వెళ్లి మరీ తర్వాత బతికాడు. ఆ తర్వాత మళ్లీ  నార్మల్ లైఫ్ లీడ్ చేస్తూ.. ఎప్పటిలాగానే సోషల్ మీడియాలో సందడి చేసిన రఫీ ఇప్పుడు అనూహ్యంగా ఆత్మహత్య చేసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu