తలసాని పర్యటన ఎఫెక్ట్: బెజవాడ దుర్గ గుడిలో కొత్త రూల్స్

sivanagaprasad kodati |  
Published : Jan 17, 2019, 04:26 PM IST
తలసాని పర్యటన ఎఫెక్ట్: బెజవాడ దుర్గ గుడిలో కొత్త రూల్స్

సారాంశం

బెజవాడ ఇంద్రకీలాద్రిపై ప్రభుత్వం నిబంధనలు కఠినతరం చేసింది. అమ్మవారికి దర్శనానికి వచ్చిన తెలంగాణ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజకీయ ప్రకటన చేయడంపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. 

బెజవాడ ఇంద్రకీలాద్రిపై ప్రభుత్వం నిబంధనలు కఠినతరం చేసింది. అమ్మవారికి దర్శనానికి వచ్చిన తెలంగాణ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజకీయ ప్రకటన చేయడంపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆలయ పరిసరాలు ఆధ్యాత్మికంగానే ఉండాలని తెలిపింది.

ఇంద్రకీలాద్రి పరిసరాల్లో ఎటువంటి రాజకీయాలు మాట్లాడకూడదని, ప్రెస్‌మీట్‌లకు అనుమతి లేదని ఆలయ అధికారులు స్పష్టం చేశారు. వాణిజ్యపరమైన పోస్టర్లు, ఫ్లెక్సీలు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హచ్చరించారు.

ఇబ్రహీంపట్నం వద్ద ఆర్కే కాలేజీలో జరిగిన యాదవ సమ్మేళనంలో పాల్గొనేందుకు వచ్చిన తలసాని శ్రీనివాస్ యాదవ్ అనంతరం బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణలో యాదవులకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నామన్నారు. చట్ట సభల్లో యాదవులకు తగినన్ని అవకాశాలు ఇస్తూ తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. ఏపీలో యాదవులు రాజకీయంగా ఎదిగేందుకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. 

అమరావతి: చంద్రబాబుపై తలసాని ఘాటు వ్యాఖ్యలు (వీడియో)

చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ రెడీ, 3 నెలలే: తలసాని

తలసాని వ్యాఖ్యలు: తప్పుబడుతున్న దుర్గగుడి పాలకమండలి

 

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు