తుని పరిసర ప్రాంతాల్లో పులి సంచారం: చిక్కకుండా చుక్కలు చూపిస్తున్న టైగర్

By narsimha lodeFirst Published Jun 28, 2022, 11:04 AM IST
Highlights

కాకినాడ జిల్లా వాసులకు పులి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. తుని మండలంలో పులి సంచరించినట్టుగా అటవీశాకాధికారులు గుర్తించారు. దీంతో తుని ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. పులి పాద ముద్రలను కూడా ఫారెస్ట్ అధికారులు గుర్తించారు.


తుని: Kakinada  జిల్లా వాసులకు Tiger  కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. తుని మండలంలో పులి సంచరించినట్టుగా అటవీశాఖాధికారులు గుర్తించారు. అటవీ ప్రాంతానికి పులి వెళ్లినట్టుగా భావించారు. అయితే రెండు రోజులుగా పులి మళ్లీ జనావాసాలకు వచ్చినట్టుగా అటవీశాఖాధికారులు గుర్తించారు. Tuni మండలంలోని కొండల మాటున పులి పాదముద్రలను అటవీశాఖాధికారులు గుర్తించారు.

సోమవారం నాడు రాత్రి కొలిమేర-kummarlova సమీపంలోని కుచ్చరికొండ వద్ద పెద్దపులి రోడ్డు దాటేందుకు ప్రయత్నించిన విషయాన్ని అదే దారిలో వెళ్తున్న ప్రయాణీకులు గుర్తించి అటవీశాఖాధికారులకు సమాచారం ఇచ్చారు. కొండల మాటున పులి పాదముద్రలను అటవీశాఖాధికారులు గుర్తించారు. దీంతో ఈ ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.తుని పట్టణంలోని కొట్టాం బస్టాండ్ నుండి కుమ్మరిలోవ కొలిమేరు వెళ్లే మార్గంలో ప్రయాణం చేయవద్దని అధికారులు సూచిస్తున్నారు.  కాకినాడ జిల్లా వాసులను పులి భయం వెంటాడుతుంది. ఈ పులిని బంధించేందుకు అటవీశాఖాధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. పులి సంచరించే ప్రాంతాల్లో బోనులు కూడా ఏర్పాటు చేశారు. కానీ బోను వద్దకు వచ్చినట్టే వచ్చిన పులి తప్పించుకుపోయింది.

పులి సంచార తీరు ఆందోళనకరంగా ఉంది. మూడు రోజులు ఎస్‌.పైడిపాలలో సంచరించాక ఎ.మల్లవరం, లచ్చిరెడ్డిపాలెం గ్రామాల వెంబడి తిరిగింది. పులిని బంధించేందుకు ప్రయత్నిస్తున్నామని ఏలేశ్వరం రేంజర్‌ జె.శ్రీనివాస్‌ తెలిపారు.

కాకినాడ జిల్లాలోకి అటవీ ప్రాంతంనుండి జనావాసంలోకి ఈ ఏడాది మే 29న వచ్చినట్టుగా అధికారులు గుర్తించారు. అప్పటి నుండి ఈ పులి అధికారులకు చుక్కలు చూపిస్తుంది. కాకినాడ జిల్లాలోని పోతులూరు వద్ద  పది పశువులను పులి చంపి తింది.  అప్పటి నుండి పులిని పట్టుకొనేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలు పలించలేదు.

జిల్లాలోని పొదురుపాక, శరభవరం, ఒమ్మంగి, పాండవుల పాలెం తదితర ప్రాంతాల్లో పులి సంచరించినట్టుగా అధికారులు గుర్తించారు. ఈ ప్రాంతాల్లో బోనులు ఏర్పాటు చేసి పులి కోసం మాంసాన్ని కూడా ఎరగా వేశారు. అయితే బోను వద్దకు వచ్చినట్టే వచ్చిన పులి తిరిగి వెళ్లిపోయింది. ఈ దృశ్యాలను అక్కడే ఏర్పాటు చేసిన Cameraలలో రికార్డయ్యాయి.ఈ పులి సంచారంలో 11 గ్రామాల ప్రజలకు కంటిమీద కునుకు లేకుండాపోయింది. మే 25వ తేదీ నుండి పులి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. 

మత్తు ఇంజెక్షన్ ఇచ్చి పులిని పట్టుకోవాలని అధికారులు బావిస్తున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే పులి అడవిలోకి వెళ్తుందని భావించినప్పటికీ  పులి మాత్రం అడవిలోకి వెళ్లకుండా గ్రామాల మధ్యే తిరుగుతుంది., పులిని బంధించే వరకు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.ఈ ఏడాది జూన్ 11న జిల్లాలోని శంఖవరం మండలం వజ్రకూటం గ్రామ సమీపంలో పెద్దపులి కన్పించిందని స్థానికులు అటవీశాఖాధికారులకు సమాచారం ఇచ్చారు.

 ఆటో డ్రైవర్ కె. నందీశ్వరరావు తన కుటుంబంతో ఏలేశ్వరానికి కుటుంబంతో వెళ్తున్న సమయంలో వజ్రకూటం వద్ద ఆయిల్ ఫాం ప్లాంటేషన్ వద్ద పులిని గమనించాడు. పులి గురించి నందీశ్వరరావు స్థానికులకు ఫోన్ లో సమాచారం ఇచ్చాడు. అయితే ఆటోలోని మహిళలు, పిల్లలు భయంతో కేకలు వేశారు. దీంతో పులి కత్తిపూడి రోడ్డులోని డెయిరీ పారం వైపు వెళ్లిందని ఆయన చెప్పారు. 

click me!