కొండ్రు మురళికి టికెట్ ఖరారు చేసిన చంద్రబాబు

Published : Sep 20, 2018, 04:11 PM IST
కొండ్రు మురళికి టికెట్ ఖరారు చేసిన చంద్రబాబు

సారాంశం

పోయిన ఎన్నికల్లో ఈ సీటు నుంచి మాజీ స్పీకర్‌ ప్రతిభా భారతి పోటీ చేశారు.

ఇటీవల పార్టీలోకి చేరిన కొండ్రు మురళికి టీడీపీ అధినేత చంద్రబాబు టికెట్ ఖరారు చేశారు. శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గం టికెట్ మాజీ మంత్రి కొండ్రు మురళికి కేటాయిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. రాజాం నియోజకవర్గం విజయనగరం ఎంపీ స్థానం పరిధిలోకి వస్తుంది. పోయిన ఎన్నికల్లో ఈ సీటు నుంచి మాజీ స్పీకర్‌ ప్రతిభా భారతి పోటీ చేశారు.
 
ఈసారి అక్కడ మురళీకి అవకాశం ఇచ్చే యోచనతో ఆయనను ఇన్‌చార్జిగా నిర్ణయించారు. దీనికి ముందు ఆయన ప్రతిభాభారతితో విడిగా మాట్లాడారు. రాజాంలో ఈసారి పార్టీ గెలుపు ముఖ్యమని, ఈ కోణంలో తీసుకొంటున్న నిర్ణయానికి సహకరించాలని కోరారు. ఆమెకు ఇతరత్రా అవకాశాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఆమె దానికి అంగీకారం తెలిపారు. మురళీని ఇన్‌చార్జిగా ప్రకటించిన సమావేశంలో ఆమె కూడా ఉన్నారు.  కాగా కోండ్రు మురళీమోహన్‌ సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. నమ్మకాన్ని వమ్ము చేయనని..నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషిచేస్తానన్నారు.

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే