కులాంతర వివాహాలు చేసుకున్న వారికి అండగా ఉంటా: కారెం శివాజీ

By Nagaraju TFirst Published Sep 20, 2018, 3:07 PM IST
Highlights

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న పరువు హత్యలపై ఏపీ ఎస్సీఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ ఆవేదన వ్యక్తం చేశారు. కులాంతర వివాహాలు చేసుకున్న వారిపై దాడులకు తెగబడటం దురదృష్టకరమన్నారు. 

విజయవాడ: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న పరువు హత్యలపై ఏపీ ఎస్సీఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ ఆవేదన వ్యక్తం చేశారు. కులాంతర వివాహాలు చేసుకున్న వారిపై దాడులకు తెగబడటం దురదృష్టకరమన్నారు.  

కులాంతర వివాహాలు చేసుకున్న జంటలకు ఎస్సీ, ఎస్టీ కమిషన్ అండగా ఉంటుందని శివాజీ హామీ ఇచ్చారు. ఏ జంటకైనా ప్రాణహాని ఉంటే సమీపంలోని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. 

మిర్యాలగూడలోని ప్రణయ్‌ హత్యకేసులో నిందితులను ఉరితియ్యాలని కారెం శివాజీ డిమాండ్ చేశారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఎస్సీ, ఎస్టీలపై దాడులు పెరిగాయని ఆరోపించారు. కులాంతర వివాహాలు చేసుకున్న వారికి రక్షణ కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కులాంతర వివాహాలు చేసుకున్న వారిపై దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించేలా చట్టాలను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు.

click me!