జగన్ కి మరో షాక్..టీడీపీలోకి మరో సీనియర్

By ramya neerukondaFirst Published Sep 20, 2018, 3:28 PM IST
Highlights

దీంతో మనస్థాపానికి గురై పార్టీని వీడారు. టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. 

శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ అధినేత జగన్ కి మరో షాక్ తగిలింది. ఇటీవలే సీనియర్ నేత ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే మీసాల నీలకంఠంనాయుడు సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరగా...తాజాగా పలాస-కాశీబుగ్గ మున్సిపాల్టీ తొలి చైర్మన్‌, వైసీపీ మాజీ సమన్వయకర్త వజ్జ బాబూరావు తెలుగుదేశం పార్టీలోకి చేరడానికి నిర్ణయించుకున్నారు. 

ముహూర్తం కుదిరితే మరో వారం రోజుల్లో సీఎంను కలుసుకొని ఆ పార్టీలోకి చేరేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. 1994 ఎన్నికల్లో టెక్కలి నియోజకవర్గం నుంచి టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌పై కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసి బాబూరావు ఓటమి చవిచూశారు. 2002లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి పలాస-కాశీబుగ్గ మున్సిపాల్టీ తొలి చైర్మన్‌గా ఎన్నికయ్యారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా ప్రత్యక్ష ఎన్నికల్లో మంచి మెజా ర్టీతో గెలుపొందారు. అటు తరువాత మారిన రాజ కీయ పరిణామాల నేపథ్యంలో వైసీపీలో చేరారు.

2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. టీడీపీ అభ్యర్థి గౌతు శ్యామసుందర శివాజీపై 17 వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. తరువాత ఏడాది వరకూ వైసీపీ నియోజకవర్గ సమన్వయ కర్తగా వ్యవహరించారు. అటు తరువాత వివిధ సమీకరణల్లో భాగంగా మాజీ ఎమ్మెల్యే జుత్తు జగన్నాయకులను నియోజకవర్గ సమన్వయకర్తగా జగన్‌ నియమించారు. దీంతో మనస్థాపానికి గురై పార్టీని వీడారు. టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. 

click me!