ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ హవా: ముగ్గురు అభ్యర్థులు ఏకగ్రీవం

By Nagaraju penumalaFirst Published Aug 19, 2019, 6:13 PM IST
Highlights

ఈ మూడు స్థానాలకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున రాష్ట్ర మంత్రి మోపిదేవి వెంకటరమణ, మైనార్టీ నేత మహ్మద్‌ ఇక్బాల్, కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్‌ నేత చల్లా రామకృష్ణారెడ్డిలు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ ముగ్గురు ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి సోమవారం ప్రకటించారు. 

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో ముగ్గురు ఎమ్మెల్సీల ఎన్నిక ఏకగ్రీమమైంది. ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న మూడు స్థానాలను వైసీపీ తన ఖాతాలో వేసుకుంది. ఇకపోతే ఈ మూడు స్థానాలకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున రాష్ట్ర మంత్రి మోపిదేవి వెంకటరమణ, మైనార్టీ నేత మహ్మద్‌ ఇక్బాల్, కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్‌ నేత చల్లా రామకృష్ణారెడ్డిలు నామినేషన్లు దాఖలు చేశారు. 

ఈ ముగ్గురు ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి సోమవారం ప్రకటించారు. ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవం కావడంతో రిటైర్డ్ ఐఏఎస్, పార్టీ సీనియర్ నేత మహ్మద్‌ ఇక్బాల్‌ ఎమ్మెల్సీగా ధృవీకరణ పత్రం అందుకున్నారు. 

మరోవైపు కర్నూలు జిల్లాకు చెందిన చల్లా రామకృష్ణారెడ్డి కూడా రిటర్నింగ్ అధికారి నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైనట్లు ధృవీకరణ పత్రాన్ని అందుకున్నారు. అయితే మంత్రి మోపిదేవి వెంకటరమణ ధృవీకరణ పత్రాన్ని అందుకోలేదు. 

వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న సందర్భంగా మోపిదేవి వెంకటరమణ రిటర్నింగ్ అధికారిని కలుసుకోలేకపోయారు. ఇకపోతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి పూర్తిస్థాయి మెజారిటీ ఉండటంతో ప్రతిపక్ష టీడీపీ నుంచి ఎవరు బరిలో నిలువలేదన్న విషయం తెలిసిందే. 

ఈ వార్తలు కూడా చదవండి

వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ దాఖలు

రంజాన్ రోజు మాటిచ్చారు, బక్రీద్ రోజున పదవి: జగన్‌పై ఇక్బాల్ ప్రశంసలు

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఉపఎన్నికకు నోటిఫికేషన్ విడుదల

ఎమ్మెల్సీ ఉప ఎన్నిక: వైసీపీ అభ్యర్ధులు వీరే

వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ దాఖలు

click me!