కారును ఢీకొన్న బస్సు.. ముగ్గురు మృతి

Published : Jan 06, 2021, 07:19 AM IST
కారును ఢీకొన్న బస్సు.. ముగ్గురు మృతి

సారాంశం

ఈ ప్రమాదం మంగళవారం అర్ధరాత్రి దెందులూరు హైవేపై ఈ ఘటన చోటు చేసుకుంది.   

పశ్చిమగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని దెందులూరు సమీపంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి కారును బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ప్రమాదం మంగళవారం అర్ధరాత్రి దెందులూరు హైవేపై ఈ ఘటన చోటు చేసుకుంది. 

స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేశారు. అనంతరం మృతుల వివరాలను పోలీసులు వెల్లడించారు.మృతులు రామకృష్ణ(25), గాంధీ(25), నాని(25)లు పోలీసులు గుర్తించారు. వీరంతా భీమడోలు మండలం గుండుగొలనువాసులని పోలీసులు తెలిపారు. కాగా.. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ కుండపోత వర్షాలు, వరదలు... ఇక్కడ కూడా వానలు షురూ..!
Hello Lokesh Interaction: హలో లోకేష్ కార్యక్రమంలోవిద్యార్థులతో లోకేష్ పంచ్ లు | Asianet News Telugu