Chandrababu Naidu: పోలీసుల పని ప్రజలు చేయాలా?.. చరిత్రలో ఎన్నడూ ఇలా జరగలేదు.. చంద్రబాబు నాయుడు ఫైర్

By team teluguFirst Published Nov 15, 2021, 2:08 PM IST
Highlights

చరిత్రలో ఎన్నికలను (Elections) ఇంత అపహాస్యం చేసిన ఘటనలు ఎన్నడూ లేవని చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) వ్యాఖ్యానించారు. కుప్పం (kuppam) ప్రశాంతమైన ప్రాంతం అని.. రౌడీయిజం తెలియని ప్రాంతమని.. అక్కడి ప్రజానీకం నీతి, నిజాయితికి మారు పేరు అని అన్నారు. అక్కడికి కూడా రౌడీలను తీసుకొచ్చారని మండిపడ్డారు.

దొంగ పనులు, హత్యలు చేయించడం వైసీపీ నాయకుల నైజం అని తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఆరోపించారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను కాపాడుకుంటే.. అది ప్రజలను కాపాడుతుందని చెప్పారు. సోమవారం కుప్పంలో కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు (kuppam municipal election) సంబంధించి చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) ప్రభుత్వంపై, నాయకులపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. చరిత్రలో ఎన్నికలను ఇంత అపహాస్యం చేసిన ఘటనలు ఎన్నడూ లేవని వ్యాఖ్యానించారు. కుప్పం ప్రశాంతమైన ప్రాంతం అని.. రౌడీయిజం తెలియని ప్రాంతమని.. అక్కడి ప్రజానీకం నీతి, నిజాయితికి మారు పేరు అని అన్నారు. అక్కడికి కూడా రౌడీలను తీసుకొచ్చారని మండిపడ్డారు.

శాంతిభద్రతల సాకుతో ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని చంద్రబాబు అధికారుల తీరుపై మండిపడ్డారు. పైశిచాక ఆనందం పొందాలని చూస్తున్నారని విమర్శించారు. తప్పు చేసిన వారిలో ఎంత మందిపై కేసులు పెట్టారని ప్రశ్నించారు. ఏం చేసిన జరిగిపోతుందుంటే శిక్ష తప్పదని హెచ్చరించారు. ప్రజా వ్యతిరేకతను కప్పిపుచ్చడానికి ఇన్ని కుట్రలా.. అని ప్రశ్నించారు. 

Also read: Kuppam Municipala Election: టిడిపి అభ్యర్థిని అడ్డుకున్న పోలీసులు... కుప్పంలో ఉద్రిక్తత

అవినీతిపై ప్రజలు పోరాడే స్థితికి వచ్చారని అన్నారు. కుప్పంలో Fake votersను ప్రజలు అడ్డుకుంటున్నారని చంద్రబాబు తెలిపారు. పోలీసుల పని ప్రజలు చేయలా అని ప్రశ్నించారు. దొంగ ఓటర్లను పట్టుకున్న వారిపైనే దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. దుర్మార్గపు రాజకీయాలను అడ్డుకుంటామని తెలిపారు. దొంగ ఓటర్లను వారి కుటుంబ సభ్యులే అసహ్యించుకుంటున్నారని అన్నారు. టీడీపీ పోలింగ్ ఏజెంట్లను అరెస్ట్ చేసి వేరే ప్రాంతాలకు తరలించారని చెప్పారు. దొంగ ఓటర్లను పట్టుకున్నవారిపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం దుర్మార్గమని అన్నారు. 

గెలిచామని చెప్పుకోవడానికి అక్రమాలకు పాల్పడుతున్నారు. ఎక్కడ చూసిన తప్పుడు కేసులే కనిపిస్తున్నాయని అన్నారు. ఏం చేసిన చెల్లుతుంది అనుకుంటే కుదరదని తెలిపారు. ఇంత దారుణంగా వ్యవహరిస్తే చరిత్ర హీనులుగా మిగిలిపోతారని అన్నారు. పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అయిపోయిందని ఆరోపించారు. దొంగలకు వంతపాడే విధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితికి వచ్చారని అన్నారు. దొంగ ఓట్లు వేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము పోరాడేది municipal elections కోసం కాదని.. ప్రజాస్వామ్య పరిరక్ష కోసమని అన్నారు. కుప్పంలో దొంగ ఓట్లకు సంబంధించిన వీడియోను చంద్రబాబు ప్రదర్శించారు. 

Also read: Kuppam Election: బాబాయ్‌ని గొడ్డ‌లి పోటులాగే... ప్రజాస్వామ్యంపై దొంగఓట్ల వేటు: లోకేష్ ఆగ్రహం

ఇదిలా ఉంటే కుప్పంలో మున్సిపల్ ఎన్నికల సరళిని పరిశీలించడానికి చంద్రబాబు వెళ్లనున్నట్టుగా తొలుత ప్రచారం జరిగినప్పటికీ.. తర్వాత ఆయన దానిని రద్దు చేసుకున్నారు. కుప్పంలోని పార్టీ నేతలతో ఆయన టెలీకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. కుప్పం మున్సిపాలిటీకి ఎన్నికలు జరుగుతున్నాయి. కుప్పం మున్సిపాలిటీలో మొత్తం 25 వార్డులు ఉండగా.. ఒకటి ఏకగ్రీవం కావడంతో మిగిలిన 24 వార్డులకు పోలింగ్ జరుగుతుంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 

click me!