గుంటూరులో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు విద్యార్థులు మృతి..

By SumaBala Bukka  |  First Published Feb 5, 2022, 7:48 AM IST

గుంటూరు జిల్లా మంగళగిరిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో బైక్ మీద ప్రయాణిస్తున్న ముగ్గురు విద్యార్థులు విద్యుత్ స్తంభానికి ఢీ కొట్టారు. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. 


గుంటూరు : andhrapradesh రాష్ట్రంలోని guntur జిల్లాలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. road accidentలో ముగ్గురు students మరణించారు. liquor సేవించి బైక్ మీద ప్రయాణిస్తున్న ముగ్గురు విద్యార్థులు ప్రమాదంలో మృత్యవాత పడ్డారు. బైక్ విద్యుత్తు స్తంభాన్ని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ముగ్గురు విద్యార్థుల్లో ఒకరు అక్కడికక్కడే మరణించగా, మరో ఇద్దరు ఆస్పత్రికి తరలిస్తుండగా మరమించారు. 

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కృష్ణాయపాలెం వద్ద ఆ ప్రమాదం జరిగింది. మృతులను పెనుమాకవాసులుగా గుర్తించారు. జన్మదిన వేడుకలకు వెళ్లి తిరిగి వస్తుండగా విద్యార్థులు రోడ్డు ప్రమాదానికి బలయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Latest Videos

ఇదిలా ఉండగా, జనవరి 30 ఆదివారం తెల్లవారుజామున తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ లో ఘోర రోడ్డ ప్రమాదం జరిగింది. అతివేగంతో వచ్చిన కారు అదుపుతప్పి నిరుపేదల గుడిసెలపైకి దూసుకెళ్లడంతో నలుగురు మహిళలు నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. కరీంనగర్ కమాన్ వద్ద కొందరు వీధివ్యాపారులు గుడిసెలు వేసుకుని వుంటున్నారు. 

ఆదివారం వేకువజాముననలుగురు యువకులు కరీంనగర్ నుండి హైదరాబాద్ వెళుతుండగా వీరి గుడిసెల వద్దకు రాగానే  కారు అదుపుతప్పింది. దీంతో ఒక్కసారిగా కారు అతివేగంతో గుడిసెలపైకి దూసుకెళ్లింది. దీంతో గుడిసెల్లో నిద్రిస్తున్నవారిపైనుండి కారు దూసుకెళ్లి.. నలుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన వారిని ఫరియాద్‌, సునీత, లలిత, జ్యోతిలుగా గుర్తించారు. కారు బీభత్సానికి చాలామంది తీవ్రంగా గాయపడి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. వీరిలో కూడా కొందరి పరిస్థితి విషయమంగా వుందని తెలుస్తోంది. ఘటనా స్థలంలో ఓ మహిళ మృతదేహం కారుకింద నలిగి నుజ్జనుజ్జయి పడివుంది. మిగతా ముగ్గురు మహిళలు హాస్పిటల్ కు తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయారు. 

ఈ  ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు కమాన్ చౌరస్తా వద్దకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను కాపాడి హాస్పిటల్ కు తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, కమాన్ సెంటర్ వద్ద రోడ్డు ప్రమాదానికి కారు యజమాని రాజేంద్ర ప్రసాద్ నిర్లక్ష్యమే కారణమని పోలీసులు తేల్చారు. ఈ ప్రమాదానికి పరోక్షంగా  కారణమైన రాజేంద్రప్రసాద్ ను కూడా అరెస్ట్ చేశామని కరీంనగర్ సీపీ  సత్యనారాయణ తెలిపారు.

 రాజేంద్ర ప్రసాద్ తో పాటు ఘటన జరిగిన సమయంలో కారులో ఉన్న ముగ్గురు మైనర్లు వర్ధన్, అభిరామ్, దీక్షిత్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరంతా ఆ సమయంలో మద్యం సేవించి ఉన్నట్లు తెలిసింది. అంతేకాదు మైనర్ కి కారు అందుబాటులో ఉంచడం వల్లే ప్రమాదం జరిగిందని సీపీ తెలిపారు. పొగమంచు కారణంగా బ్రేక్ తొక్కబోయి.. బదులుగా యాక్సిలేటర్ ను తొక్కడంతో ప్రమాదం జరిగిందని సీపీ చెప్పారు. ఈ ప్రమాదానికి ముగ్గురు మైనర్లు కూడా కారణమని కూడా ఆయన తెలిపారు. కారును వంద కిలోమీటర్ల స్పీడ్ తో మైనర్ బాలుడు వర్ధన్ నడిపినట్టుగా పోలీసులు గుర్తించారు. అంతేకాదు అతడికి సరిగా డ్రైవింగ్ కూడా రాదని పోలీసులు తెలిపారు.  

click me!