అల్లూరి జిల్లాలో విషాదం: సోకిలేరు వాగులో ముగ్గురు గల్లంతు,రెండు మృతదేహలు వెలికితీత

Published : Sep 26, 2022, 03:46 PM IST
 అల్లూరి జిల్లాలో విషాదం: సోకిలేరు వాగులో ముగ్గురు గల్లంతు,రెండు మృతదేహలు వెలికితీత

సారాంశం

అల్లూరి జిల్లా చింతూరు సోకిలేరు వాగులో పడి ముగ్గురు విద్యార్ధినులు గల్లంతయ్యారు. వాగు నుండి ఇద్దరి మృతదేహలను వెలికితీశారు. మరొకరి కోసం గాలింపు కొనసాగుతుంది.


చింతూరు: అల్లూరి జిల్లా చింతూరు సోకిలేరు వాగులో ముగ్గురు విద్యార్ధినులు గల్లంతయ్యారు. ఇందులో ఇద్దరి మృతదేహలను వెలికి తీశారు మరొకరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. విహార యాత్రకు వచ్చిన టెన్త్ క్లాస్ విద్యార్ధినులు సోకిలేరు వాగులో పడి గల్లంతయ్యారు.

బాపట్ల జిల్లాలోని చీరాలలోని ఓ స్కూల్ కు చెందిన విద్యార్ధులు అల్లూరి జిల్లా చింతూరు కు విహారయాత్ర కోసం వచ్చారు. చింతూరులోని సోకిలేరు వాగు వద్ద గుమ్మడి జయశ్రీ, సువర్ణ కమల,  గీతాంజలి అనే ముగ్గురు విద్యార్ధినులు గల్లంతయ్యారు. వీరిలో ఇద్దరి మృతదేహలను వెలికి తీశారు. మరొకరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. విహరయాత్రకు వచ్చి సోకిలేరు వాగులో పడి మృతి చెందడం విషాదాన్ని నింపింది. 
 

PREV
click me!

Recommended Stories

AP Food Commission Chairman: అధికారులకు చుక్కలు చూపించిన ఫుడ్ కమీషన్ చైర్మన్| Asianet News Telugu
Ayodhya Temple: కొత్త సంవత్సరం సందర్బంగా అయోధ్యలో పోటెత్తిన భక్తులు | Asianet News Telugu