
కర్నూలు (kurnool district) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (road accident) చోటు చేసుకుంది. మహిళా కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళా కూలీలు మరణించగా.. 10 మంది పరిస్ధితి విషమంగా వుంది. ప్రమాద సమయంలో ట్రాక్టర్‌లో 20 మంది వరకు మహిళలు వున్నట్లుగా తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం వుందని సమాచారం. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, అధికార యంత్రాంగం సహాయక చర్యలు ప్రారంభించారు.