అనంతపురంలో విషాదం:ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య

Published : Mar 10, 2021, 01:08 PM IST
అనంతపురంలో విషాదం:ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య

సారాంశం

 జిల్లాలోని గార్లదిన్నె మండలం యర్రగుంట్ల గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకొన్నారు. ఈ ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది. 


అనంతపురం: జిల్లాలోని గార్లదిన్నె మండలం యర్రగుంట్ల గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకొన్నారు. ఈ ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది. 

ఎర్రగుంట్ల గ్రామానికి చెందిన శ్రీనివాసులు, బాలమ్మ దంపతులకు రామకృష్ణ, రమేష్, ఆనంద్ సంతానం. వీరిది ఉమ్మడి కుటుంబం. వీరికి ఆరు ఎకరాల భూమి ఉంది. ఈ భూమిలో చీనీ, వేరుశనగ, వరి ఇతర పంటలు సాగు చేసేవారు. వ్యవసాయ పనులను పెద్ద కొడుకు రామకృష్ణ, రెండో కొడుకు రమేష్ చూసేవారు. చిన్న కొడుకు ఆనంద్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు.

రామకృష్ణకు తాడిపత్రి మండలం జూటూరుకు చెందిన రాజేశ్వరితో 17 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. వీరికి 14 ఏళ్ల యోగేంద్ర అనే కొడుకు ఉన్నాడు. యోగేంద్ర అనంతపురంలోని స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు.

రామకృష్ణ, రాజేశ్వరీ దంపతులిద్దరూ గ్రామంలో వ్యవసాయ పనులు చేయడంతో పాటు పశువులను పెంచేవారు. పాలను విక్రయించేవారు. రోజూ ఉదయాన్నే పాలను కొనుగోలు చేసేందుకు స్థానికులు రామకృష్ణ ఇంటికి వచ్చేవారు. మంగళవారం నాడు ఉదయం రామకృష్ణ దంపతులు నిద్ర లేవలేదు. 

దీంతో రామకృష్ణ తండ్రి రామకృష్ణ గది వద్దకు వెళ్లి చూశాడు. కొడుకు, కోడలు, మనమడు మంచంపై విగతజీవులుగా పడి ఉండడాన్ని చూసిన తండ్రి కేకలు వేశాడు. ఈ కేకలు విన్న స్థానికులు అక్కడికి చేరుకొన్నారు. 

సంఘటన స్థలంలో నిద్రమాత్రలు లభించాయి. సోమవారం నాడు భోజనం చేసిన తర్వాత నిమ్మరసంలో పురుగుల మందు కలుపుకొని తాగారా, లేదా నిద్రమాత్రలు వేసుకొన్నారా అనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు పోలీసులు  కేసు నమోదు చేసుకొన్నారు.
 

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్