విశాఖలో విషాదం: స్పిరిట్ తాగి ముగ్గురు మృతి

By narsimha lodeFirst Published May 31, 2020, 3:58 PM IST
Highlights

విశాఖపట్ణణం జిల్లాలోని కశింకోట గోవిందరావు కాలనీలో ఆదివారం నాడు విషాదం చోటు చేసుకొంది. మత్తు కోసం స్పిరిట్ తాగి ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
 

విశాఖపట్టణం: విశాఖపట్ణణం జిల్లాలోని కశింకోట గోవిందరావు కాలనీలో ఆదివారం నాడు విషాదం చోటు చేసుకొంది. మత్తు కోసం స్పిరిట్ తాగి ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

గోవింరావు కాలనీకి చెందిన కూనిశెట్టి ఆనందర్ రావు స్నేహితులతో కలిసి పార్టీ చేసుకొందామని భావించాడు. తనతో పాటు మరో నలుగురు స్నేహితులను పిలిచాడు. మద్యం కంటే ఎక్కువ కిక్కు వస్తోందనే ఉద్దేశ్యంతోనే స్పిరిట్  తాగారు. ఈ పార్టీలో ఐదుగురు పాల్గొన్నారు. అయితే పార్టీలో ఐదుగురు స్పిరిట్ తాగారు. వీరిలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. 

మరో ముగ్గురిని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మరణించారు. చనిపోయిన వారిని వడిసెల నూకరాజు, అప్పారావు, ఆనంద్ గా గుర్తించారు.  మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అస్వస్థతకు గురైన వారికి చికిత్స అందిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం నియంత్రణ దిశగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే మద్యం ధరలను 75 శాతం పెంచుతూ మధ్యం ధరలను ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.  మద్యం ప్రియులు  కిక్కు కోసం స్పిరిట్ తో పాటు ఇతర వాటిని  ఆశ్రయిస్తున్నారు.గత మాసంలో తమిళనాడు రాష్ట్రంలో స్పిరిట్ తాగిన ఘటనలో పలువురు మరణించిన విషయం తెలిసిందే. 

click me!