నెల్లూరు జిల్లాలో ముగ్గురు విద్యార్థినుల మిస్సింగ్.. ఆందోళనలో తల్లిదండ్రులు..

Published : Jan 24, 2023, 09:53 AM IST
నెల్లూరు జిల్లాలో ముగ్గురు విద్యార్థినుల మిస్సింగ్.. ఆందోళనలో తల్లిదండ్రులు..

సారాంశం

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ముగ్గురు బాలిలక అదృశ్యం కలకలం రేపుతుంది. జిల్లాలోని రాపూర్‌ గిరిజన గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థినులు కనిపించకుండా పోయారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ముగ్గురు బాలిలక అదృశ్యం కలకలం రేపుతుంది. జిల్లాలోని రాపూర్‌ గిరిజన గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థినులు కనిపించకుండా పోయారు. వివరాలు.. విద్యార్థినులు జ్యోతి, నాగమణి, అంకిత గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు. వీరు  రాపూరు, కలువాయి, పొదలకురు‌కు చెందినవారు. అయితే హాస్టల్ నుంచి బయటకు వెళ్లిన  ముగ్గురు విద్యార్థులు తిరిగి రాలేదు. రాత్రి హాజరు సమయంలో విద్యార్థినులు మిస్సింగ్ అయినట్లు సిబ్బంది గుర్తించారు. 

ఇందుకు సంబంధించి విద్యార్థులు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఈ విషయం తెలుసుకున్న బాలికల తల్లిదండ్రులు  తీవ్ర ఆందోళన చెందుతున్నారు. విద్యార్థినుల మిస్సింగ్‌పై వారి తల్లిదండ్రులు, గురుకుల పాఠశాల సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు  చేశారు. దీంతో బాలికల ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?