విశాఖ: శారదా నదిలో మునిగి ముగ్గురు రైతులు మృతి

Siva Kodati |  
Published : Jul 11, 2021, 05:16 PM IST
విశాఖ: శారదా నదిలో మునిగి ముగ్గురు రైతులు మృతి

సారాంశం

విశాఖలోని శారదా నదిలో గల్లంతై ముగ్గురు రైతులు మరణించారు. పొలం పనులకు తిరిగి వస్తూ నదిని దాటుతుండగా వీరు మునిగిపోయారు.  సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ముగ్గురి మృతదేహాలను వెలికి తీశారు.  

విశాఖ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. శారదా నదిలో ఇసుక తవ్వకాల కోసం తీసిన గుంతలు ముగ్గురి ప్రాణాలను బలిగొన్నాయి. నది దాటుతుండగా నీట మునిగిన ముగ్గురు చనిపోయారు. బుచ్చాయిపేట మండలం వడ్డాది గ్రామ శివారులో ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో ఇద్దరు వడ్డాది గ్రామంలోని పల్లె వీధికి చెందిన కొల్లిమల శ్రీను, గుడ్ల రాముగా గుర్తించారు. మరొకరు ఎల్లవరం గ్రామస్తుడు చిక్కల దారకొండగా గుర్తించారు. వీరంతా పొలం పనులకు వెళ్లి ఇంటికి తిరిగొస్తుండగా...  శారద నదిని దాటుతూ మునిగిపోయారు. వీరిని గుర్తించిన తోటి రైతులు కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ అప్పటికే ఆలస్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ముగ్గురి మృతదేహాలను వెలికి తీశారు. 
 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్