వైసీపీ చేరికల సందర్భంగా అపశృతి: పాయకరావుపేట ఎమ్మెల్యే బాబురావు కంటికి గాయం

Published : Jul 11, 2021, 04:18 PM IST
వైసీపీ చేరికల సందర్భంగా అపశృతి: పాయకరావుపేట ఎమ్మెల్యే బాబురావు కంటికి గాయం

సారాంశం

పాయకరావుపేట ఎమ్మెల్యే బాబురావు కంటికి గాయమైంది. వైసీపీలో చేరికల సందర్భంగా బాణసంచా కాల్చడంతో  నిప్పురవ్వలు ఎమ్మెల్యే కంటికి గాయమైంది. ఎమ్మెల్యే బాబురావును ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు.

విశాఖపట్టణం: విశాఖపట్టణం పాయకరావుపేట ఎమ్మెల్యే  బాబురావు కంటికి తీవ్ర గాయమైంది. ఆయనను ఆసుపత్రిలో చేర్పించారు.పాయకరావుపేటలో  వైసీపీలో చేరికల సందర్భంగా ఆదివారం నాడు ఆ పార్టీ కార్యకర్తలు  బాణసంచా కాల్చారు. అయితే బాణసంచా పేల్చడంతో  టపాసులు పేలి నిప్పురవ్వలు కంట్లో పడ్డాయి. 

దీంతో ఎమ్మెల్యే బాబురావు కంటికి గాయమైంది. వెంటనే పార్టీ కార్యకర్తలు ఆయనను ఆసుపత్రికి తరలించారు.  విశాఖ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఎమ్మెల్యేకు వైద్యులు చికిత్స చేస్తున్నారు.బాణసంచా కాల్చే సమయంలో అప్రమత్తంగా లేకపోతే ప్రమాదాలు చోటు చేసుకొంటాయి. 

బాణసంచా కాల్చే సమయంలో జాగ్రత్తగా ఉండాలని ఫైర్ సేఫ్టీ అధికారులు ప్రజలను కోరుతుంటారు.  దీపావళి, దసరా తో పాటు ఇతర పండుగల సమయాల్లో బాణ సంచా కాల్చే సమయంలో అగ్నిమాపక సిబ్బంది జాగ్రత్తలను వివరిస్తూ ప్రజలను చైతన్యపరుస్తుంటారు.
 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్