నా చావుకు కారణం నా భార్యే.. భర్త సూసైడ్ నోట్..!

Published : Jun 09, 2021, 09:13 AM IST
నా చావుకు కారణం నా భార్యే.. భర్త సూసైడ్ నోట్..!

సారాంశం

గుంటూరులో విషాదం చోటుచేసుకుంది. భార్య వేధింపులు తట్టుకోలేక ఓ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. అంతేకాదు నా చావుకు భార్యే కారణం అని లేఖ రాసి ఇంట్లో భర్త ఉరేసుకున్నాడు. ఈ సంఘటన మంగళవారం రొంపిచర్లలో జరిగింది. 

గుంటూరులో విషాదం చోటుచేసుకుంది. భార్య వేధింపులు తట్టుకోలేక ఓ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. అంతేకాదు నా చావుకు భార్యే కారణం అని లేఖ రాసి ఇంట్లో భర్త ఉరేసుకున్నాడు. ఈ సంఘటన మంగళవారం రొంపిచర్లలో జరిగింది. 

పోలీసుల కథనం ప్రకారం.. రొంపిచర్లకు చెందిన ఏలికా రామకృష్ణారావు(32)కు ఈపూరు మండలం ముప్పాళ్ల గ్రామానికి చెందిన యువతితో వివాహమయ్యింది. తరచూ దంపతుల మధ్య గొడవలు జరగడంతో భార్య ఇటీవల పుట్టింటికి వెళ్లింది. 

ఈ క్రమంలో ఈపూరు స్టేషన్ లో భర్త, అతని బంధువులమీద కేసు పెట్టింది. సోమవారం రామకృష్ణారావు, అతని బంధువులను పోలీసులు ఈపూరు స్టేషన్ కు పిలిపించి మాట్లాడారు. 

ఈ క్రమంలో రాత్రి ఇంటికి వచ్చిన రామకృష్ణారావు నా చావుకు కారణం నా భార్య, వారి కుటుంబ సభ్యులని ఉత్తరం రాసి ఇంట్లో ఉరేసుకున్నాడు. తెల్లవారుజామున అతను ఉరేసుకుని ఉండడంతో గుర్తించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు అతని కుమారుడి భార్య, కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై హజరత్తయ్య తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులను నియోజకవర్గ తెదేపా ఇన్ ఛార్జి డాక్టర్ అరవిందబాబు పరామర్శించారు. 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Speech: అవకాశం చూపిస్తే అందిపుచ్చుకునే చొరవ మన బ్లడ్ లోనే వుంది | Asianet News Telugu
Chandrababu Speech:నన్ను420అన్నా బాధపడలేదు | Siddhartha Academy Golden Jubilee | Asianet News Telugu