హాట్ టాపిక్: కరోనాకు ఆనందయ్య ఆయుర్వేద మందు, వేలాదిగా ఎగబడుతున్న జనం

By telugu teamFirst Published May 21, 2021, 9:21 AM IST
Highlights

ఏపీలోని నెల్లూరు జిల్లాలో ఆనందయ్య అనే ఆయుర్వేద వైద్యుడు కరోనాకు ఇస్తున్న మందు సంచలనం సృష్టిస్తోంది. ఆయన మందు కోసం వేలాది ప్రజలు ఆయన గ్రామానికి చేరుకుంటున్నారు.

నెల్లూరు: కరోనా వైరస్ కు నెల్లూరు జిల్లాకు చెందిన బొనిగి ఆనందయ్య అందిస్తున్న ఆయుర్వేదం మందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. ఆ మందుపై అంతటా చర్చ సాగుతోంది. వేలాది మందిగా ప్రజలు ఆయన మందు కోసం బారులు తీరుతున్నారు. తాను ఇస్తున్న మందుకు ఆయన డబ్బులేమీ వసూలు చేయడం లేదు. 

ఆయన ఇస్తున్న మందుతో ఒక్కరోజులోనే ఎంత తీవ్రమైన కేసైనా తగ్గిపోవడం, ఎంత తీవ్రంగా కరోనా ఉన్నా కేవలం రెండు రోజుల్లోనే నెగెటివ్ రావడం, కార్పొరేట్ ఆసుపత్రులు చేతులెత్తేసిన కేసులు కూడా రెండు రోజుల్లోనే తగ్గిపోవడం వంటి జరుగుతున్నాయని చెబుతున్నారు, ఇంత వరకు ఈ వైద్యంపై ఒక్క రిమార్క్ కూడా రాలేదు. వేలాది మంది నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నానికి వేలసంఖ్యలో ప్రజలు తరలి వస్తున్నారు.

 ఇతర రాష్ట్రాలకు చెందినవారు కూడా ఆ మందు కోసం వస్తున్నారు. ఎంతో మంది అత్యంత ప్రమాదకరస్థితిలో ఉన్నవారు కూడా రెండు రోజుల్లో కోలుకొని వెళ్లిన వీడియో సాక్ష్యాలు ఉన్నాయని చెబుతున్నారు.  కరోనా ఏ స్థాయిలో ఉన్నా కేవలం రెండు రోజుల్లోనే నెగెటివ్ వస్తోందని, సీటీ స్కాన్ లో చెస్ట్ సివియారిటీ స్కోర్  24/25 ఉన్నా కేవలం రెండు రోజుల్లోనే  జీరోకు వస్తోందని అంటున్నారు.
ఆక్సిజన్ అందక తీవ్ర విషమ పరిస్థితుల్లో ఉన్న వారు కూడా ఒక్కరోజులో లేచి కూర్చుంటున్నారని చెబుతున్నారు.

 ఆ మందు ఇస్తున్న బొనిగి ఆనందయ్య తాను ఇస్తున్న మందుకు డబ్బులు తీసుకోరు. మందు తయారీకి కావాల్సిన వన మూలికలను తెచ్చి ఇస్తే వాటితో మందు తయారు చేసి ఇస్తున్నారు. మందు తయారీకి తాను వాడుతున్న వస్తువులను కూడా ఆయన గోప్యంగా ఏమీ ఉంచడం లేదు.

మందుకు వాడుతున్న పదార్థాలు ఇవే...

1. అల్లం
2. తాటి బెల్లం
3. తేనె
4. నల్ల జీలకర్ర
5. తోక మిరియాలు
6. పట్టా
7. లవంగాలు
8. వేప ఆకులు
9. నేరేడు చిగుర్లు
10. మామిడి చిగుర్లు
11. నేల ఉసిరి చెట్టు
12. కొండ పల్లేరుకాయల చెట్టు
13. బుడ్డ బుడస ఆకులు
14. పిప్పింట ఆకుల చెట్టు
15. తెల్లజిల్లేడు పూల మొగ్గలు
16. ముళ్ళ వంకాయలు

తమ  పరిసర ప్రాంతాల్లో అందుబాటులోవున్నవాటిని తీసుకొని రావాలని ఆనందయ్య కోరుతున్నారు. 

అధికారుల నివేదిక ఇదీ...

ఆనందయ్య అందిస్తున్న మందుపై స్థానిక అధికారులు ఓ నివేదికను తయారు చేసి జిల్లా కలెక్టర్ కు సమర్పించారు. సదరు ఆయుర్వేద చికిత్స కోసం అవలంబిస్తున్న ప్రక్రియ శాస్త్రీయంగా నిరూపితం కావాల్సి ఉందని, చికిత్స తర్వాత వచ్చే పరిణామాలపై పరీక్షలు జరగాల్సి ఉందని వారన్నారు. కానీ నేటి వరకు ఎటువంటి వ్యతిరేక ఫిర్యాదులు గానీ చికిత్స తర్వాత తాము అనారోగ్యానికి గురయ్యామని గానీ ఎవరు కూడా తెలియజేయలేదని చెప్పారు. 

అక్కడికి వచ్చిన వారిలో ఓ రోగుకి ఆక్సిజన్ లెవెల్స్ 83 ఉండగా అతనికి కంటిలో డ్రాప్స్ వేయగానే  95కు పెరిగిందని చెపపారు. సదరు రోగితో తాము స్వయంగా మాట్లాడినట్లు తెలిపారు. 

అయితే, చికిత్స అందించే ప్రదేశంలో ఎటువంటి కోవిడ్ నిబంధనలను పాటించడం లేదని, కాట్టి చికిత్సపై నిర్ణయం తీసుకునే వరకు అక్కడ కోవిడ్ నిబంధనలను అమలు చేసే విధంగా స్థానిక అధికారులను ఆదేశించాల్సిన అవసరం ఉందని వారు చెప్పారు.

click me!