(వీడియో) జగన్ కోసం వేలమంది ఎదురుచూపులు

First Published Nov 7, 2017, 9:13 AM IST
Highlights
  • వేంపల్లె క్రాస్ రోడ్డు వద్ద వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్ర మంగళవారం రెండో రోజు ప్రారంభమైంది.

వేంపల్లె క్రాస్ రోడ్డు వద్ద వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్ర మంగళవారం రెండో రోజు ప్రారంభమైంది. ఉదయం 9 గంటలకు సోమవారం రాత్రి బస చేసిన టెంటు నుండి జగన్ బయటకు రాగానే వేలాదిమంది అభిమానులు, వైసీపీ నేతలు, శ్రేణులు పెద్ద ఎత్తున హర్షద్వానాలు మొదలుపెట్టారు. వివిధ జిల్లాల నుండి వచ్చిన అభిమానులు సోమవారం రాత్రంతా వేంపల్లె క్రాస్ రోడ్డు వద్దే రోడ్లపనే ఉండిపోయారు. వారంతా మంగళవారం ఉదయం జగన్ రాకకోసం ఎదురు చూడటం ఆశ్చర్యంగా ఉంది.

పాదయాత్రలో యువత, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పోయిన ఎన్నికల్లో చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీలను, వాటి అమలులో జరిగిన మోసాలను యువత, రైతులు పెద్ద ఎత్తున మీడియాతో పంచుకున్నారు. తమ ప్రాంతంలో సమస్యలను జగన్ కు చెప్పుకోవటానికి మహిళలు అందులోనూ డ్వాక్రా సంఘాల మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రెండో రోజు పాదయాత్ర  వైఎస్ కాలనీ, కడప-పులివెందుల హైవే, సర్వరాజకాలనీ దాటి గాలేరు-నగిరి కెనాల్ వరకూ సాగుతుంది. మధ్యలో శ్రీనివాస కల్యాణమండపంలో జగన్ రచ్చబండ కార్యక్రమంలో కూడా పాల్గొంటారు. రెండో రోజు మొత్తం మీద 12.6 కిలోమీటర్లు యాత్ర సాగనుంది.

 

click me!