‘ఓటుకునోటు’ కేసుతో ఏ సంబంధం లేదట...

Published : Nov 07, 2017, 07:22 AM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
‘ఓటుకునోటు’ కేసుతో  ఏ సంబంధం లేదట...

సారాంశం

‘ఓటుకునోటు కేసుతో తనకేం సంబంధం’..ఇది తాజాగా చంద్రబాబునాయుడు స్పందన.

‘ఓటుకునోటు కేసుతో తనకేం సంబంధం’..ఇది తాజాగా చంద్రబాబునాయుడు స్పందన. ఓటుకునోటు కేసు విషయంలో సోమవారం సుప్రింకోర్టు స్పందన తర్వాత చంద్రబాబు ఎంత అమయాకంగా ప్రశ్నిస్తున్నారో? పైగా ‘అది మన రాష్ట్రం ఎన్నిక కాదు..అదేదో నా ఎన్నిక అయినట్లు మాట్లాడుతున్నారు’ అంటూ ఎదురుదాడి చేస్తున్నారు. దానిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటూ తీర్మానించేసారు.

రెండు రాష్ట్రాల్లోని రాజకీయాలతో సంబంధం ఉన్న ఎవరిని అడిగినా ఓటుకునోటు కేసు గురించి పూర్తి వివరాలు చెబుతారు. కేసు మూలాలేంటి ? పాత్రదారులెవరు? సూత్రదారులెవరు? అన్న విషయాలు కూడా చెబుతారు. కేసు బయటపడినపుడు కెసిఆర్-చంద్రబాబుల మధ్య గనుక రాజీ కుదరిందని ప్రచారం. అదే జరగకపోయుంటే ఈ పాటికి ఏపిలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండేవారు కారన్న విషయం అందరికీ తెలిసిందే. ఓటుకునోటు కేసుతో తనకేమీ సంబంధం లేకపోతే పదేళ్ళ ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ను అర్ధాంతరంగా రాత్రికి రాత్రి ఎందుకు ఖాళీ చేసి విజయవాడకు చేరుకుంటారు?

పైగా ఆ కేసు మన రాష్ట్ర ఎన్నిక కూడా కాదట. మరి, అప్పట్లో అరెస్టయింది ఎవరు? గెలిచే బలం లేకపోయినా పోటీలోకి దిగిన అభ్యర్ధిది ఏ పార్టీ? ఓటు కోసం డబ్బులు ఇస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన రేవంత్ రెడ్డి మొన్నటి వరకూ ఏ పార్టీలో ఉన్నారు? నామినేటెడ్ ఎంఎల్ఏ ఓటుకు కోసం బేరాలు మాట్లాడుతూ ‘బాస్ పంపితేనే తాను వచ్చాను’ అంటూ రేవంత్ పదే పదే బాస్ అని సంబంధోంచింది ఎవరినో? నామినేటెడ్ ఎంఎల్ఏ స్టీఫెన్ సన్ తో పోన్ మాట్లాడిందెవరు? అన్న విషయాలకు సమాధానం చెప్పగలిగితే చాలు కేసులో చంద్రబాబు పాత్ర ఏంటో తేలిపోతుంది. ఆ కేసు గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న చంద్రబాబు కేసు విచారణ జరగకుండా స్టే ఎందుకు తెచ్చుకున్నట్లో?

PREV
click me!

Recommended Stories

CM Chandrababu: జిల్లా కలెక్టర్లే ప్రభుత్వానికిబ్రాండ్ అంబాసిడర్లు: బాబు | Asianet News Telugu
IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే