బీఆర్ఎస్ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్, రావెలకు ఢిల్లీలో కీలక బాధ్యతలు: కేసీఆర్

By narsimha lodeFirst Published Jan 2, 2023, 9:29 PM IST
Highlights

బీఆర్ఎస్ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా  తోట చంద్రశేఖర్ ను  నియమిస్తున్నట్టుగా  ఆ పార్టీ చీఫ్  కేసీఆర్ ప్రకటించారు.  మాజీ మంత్రి రావెలి కిషోర్ బాబుకు ఢిల్లీ కేంద్రంగా కీలక బాధ్యతలు అప్పగించనున్నట్టుగా  కేసీఆర్ హామీ ఇచ్చారు. 
 

హైదరాబాద్:  బీఆర్ఎస్ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ ను  తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు.  ఏపీ రాష్ట్రంలో  రానున్న రోజుల్లో భారీగా  పార్టీలో చేరికలు ఉంటాయని  కేసీఆర్ చెప్పారు.  ఎందరో కీలక నేతలు కూడా  తనకు  ఫోన్లు చేస్తున్నారన్నారు. సిట్టింగ్  ఎమ్మెల్యేలు కూడా  బీఆర్ఎస్ లో చేరేందుకు  సిద్దంగా ఉన్నారన్నారు, సంక్రాంతి తర్వాత   ఏపీ నుండి భారీ ఎత్తున చేరికలు ఉంటాయని కేసీఆర్ ప్రకటించారు. హైద్రాబాద్ కార్యాలయం కంటే  ఏపీలోని బీఆర్ఎస్ కార్యాలయం సంక్రాంతి తర్వాత పెద్ద ఎత్తున చేరుతారని కేసీఆర్  చెప్పారు.  మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు  కాన్షీరామ్ తో కలిసి పనిచేశారన్నారు.  లోక్ సభ మాజీ స్పీకర్ బాలయోగితో కూడా ఆయన పనిచేశారన్నారు.  రావెల కిసోరో బాబుతో తాను  ఐదు గంటల పాటు  చర్చించినట్టుగా  కేసీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశార.  ఢిల్లీ కేంద్రంగా  రావెల కిషోర్ బాబు పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. రావెల కిషోర్ బాబుకు ఢిల్లీ కేంద్రంగా  పనిచేసే బాధ్యతలను అప్పగిస్తానని కేసీఆర్ ప్రకటించారు. త్వరలోనే  ఈ విషయమై  పార్టీ ప్రకటన చేయనున్నట్టుగా  కేసీఆర్ వివరించారు.

మీది ప్రైవేటీకరణ, మాదీ జాతీయకరరణ: బీజేపీపై కేసీఆర్ పైర్

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని  మోడీ ప్రభుత్వం  ప్రైవేటీకరిస్తే తాము  విశాఖ ఉక్కును తిరిగి  జాతీయం చేస్తామని కేసీఆర్ ప్రకటించారు.  ఎల్ఐసీని  కేంద్రం ప్రైవేటీకరించినా తాము  ఎల్ఐసీని వెనక్కు తీసుకుంటామని కేసీఆర్ ప్రకటించారు.  బీఆర్ఎస్ ను గెలిపిస్తే దేశ వ్యాప్తంగా రైతులకు ఉచితంగా విద్యుత్ను అందిస్తామని  కేసీఆర్ ప్రకటించారు.

also read:ఏపీలో అసలు సిసలు ప్రజా రాజకీయం రావాలి: కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన ఏపీ నేతలు

అంతేకాదు  దళితబంధును కూడా  అమలు చేస్తామని  కేసీఆర్ హామీ ఇచ్చారు.తాత్కాలిక ప్రయోజనాల కోసం  మత చిచ్చును పెడుతున్నారని బీజేపీ పై కేసీఆర్ మండిపడ్డారు.   మేకిన్ ఇండియాను కేంద్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. మేకిన్ ఇండియా వల్ల ఏం ప్రయోజనం ఉందని ప్రశ్నించారు.  దేశ వ్యాప్తంగా  ప్రతి ఊరిలో  చైనా బజార్లు ఎలా వచ్చాయని  కేసీఆర్ ప్రశ్నించారు. మన దేశంలోని దేవుడి ఫోటోలతో పాటు  పతంగుల మంజా, భారత జాతీయ పతకాలను కూడా చైనా నుండి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని కేసీఆర్ ప్రశ్నించారు. 

click me!