అనంతపురంలో తయారు కానున్న కారు ఇదే

First Published May 2, 2017, 10:28 AM IST
Highlights

కియా రియోసెడాన్  ఈ మధ్య ఫోర్త్ జనరేషన్ లోకి ప్రవేశించింది. ఈ బ్రాండ్ ను ఏప్రిల్ న్యూయార్క్ లోజరిగిన ఇంటర్నేషనల్ ఆటో షోలో ప్రదర్శించారు.

 

 

ఈ పోటోల కనబడుతున్న కారు కియా రియో సెడాన్.

 

అనంతపురం పెనుగొండలో రియో కార్ల ఫ్యాక్టరీ నుంచి వెలువడనున్న  కారు ఇదే.

 

మూడురోజుల కిందట కియామోటర్స్క్ కి  ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి మధ్య ఈకార్ల ఫ్యాక్టరీ ఏర్పాటు మీద ఒక ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే.

 

 ఈ ఒప్పందం ప్రకారం,  అనంతపురంజిల్లా పెనుగొండ వద్ద ఈ కార్ల ఫ్యాక్టరీ వస్తుంది. 2019 చివరినాటికి కార్ల తయారీ పూర్తవుతుంది.  ఈ పోటోలో ఉన్న కారు, తయారయిన మార్కెట్లో కి వస్తుంది.

 

ఇండియన్ ఆటోస్ బ్లాగ్ డాట్ కాం  ప్రకారం, కియా ఇండియన్ ఉత్పత్తి కియా రియో సెడాన్ తో మొదలవుతంది.

 

కియా రియోసెడాన్  ఈ మధ్య ఫోర్త్ జనరేషన్ లోకి ప్రవేశించింది. ఈ బ్రాండ్ ను ఏప్రిల్ లో న్యూయార్క్ లోజరిగిన ఇంటర్నేషనల్ ఆటో షోలో ప్రదర్శించారు. కంపెనీకి చెందిన యూరోపియన్, అమెరికా డిజైన్ స్టూడియోలు, దక్షిణ కొరియాలో ఉన్న డిజైన్ బేస్ సహకారంతో ఈ రియో సెడాన్ వెలువడింది.

 

కారు పొడవు 172.6 అంగుళాలు, వీల్ బేస్ 101.6 అంగుళాలు, కారుకు మంచి బ్యాలెన్స్ రావడానికి  వెనకటి మోడల్స్ కంటే   ఫోర్త్ జనరేషన్ కారు వెడల్పు ఎత్తు తగ్గించారు.

 

కియో కంపెనీ హ్యుందాయ్ సోదర సంస్థయే. కారు ధర  రు 7 నుంచి 9 లక్షల (ఎక్స్ షో రూం) దాకా ఉండవచ్చు.

 

 

click me!