ఇదేమైనా రాచ‌రిక పాల‌నా...!

Published : Aug 11, 2017, 07:29 PM ISTUpdated : Mar 25, 2018, 11:38 PM IST
ఇదేమైనా రాచ‌రిక పాల‌నా...!

సారాంశం

బాబు పై విరుచుకు పడ్డా వైసీపి ఎమ్మేల్యేలు. రాచరిక పాలనను తలపిస్తుందన్న అనిల్ తాటాకు చప్పులకు ఎవరు భయపడరన్నా శ్రీనివాసులు

ఇదేమైనా రాచరిక పాలనా.. చంద్రబాబు ఏమన్నా రాజా... అంటు ప్ర‌శ్నించారు వైసీపి ఎమ్మేల్యేలు అనిల్‌ కుమార్‌ యాదవ్‌, కొర‌ముట్ల‌ శ్రీనివాసు. సీఎం తప్పు చేస్తే ప్ర‌శ్నించ‌కూడ‌దా.. తప్పు చేసిన వారిని శిక్షించాలని అడగకూడదా... అని వారు సందేహాం వ్య‌క్తం చేశారు. శుక్ర‌వారం మీడియాతో మాట్లాతూ చంద్రబాబు పై మండి ప‌డ్డారు.


 చంద్రబాబు తాటాకు చప్పుళ్లకు ఇక్క‌డ ఎవ‌రు భ‌య‌ప‌డ‌టం లేద‌ని అన్నారు ఎమ్మేల్యే అనిల్ కూమార్‌. జ‌గ‌న్‌ దిష్టిబొమ్మలను కాల్చిస్తే, చేసిన త‌ప్పులు ఒప్పులై పోతాయా అని ఆయ‌న అన్నారు. ఇచ్చిన హామీల‌ను నేర‌వేర్చాల‌ని, నిల‌దీస్తునే ఉంటామ‌న్నారు. ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేసేంత వ‌ర‌కు ప్ర‌శ్నిస్తునే ఉంటామ‌ని అన్నారు. త‌మ పార్టీ శ్రేణులు కూడా అదే ప‌ని చేస్తాయ‌ని అని చెప్పారు. 

మ‌రో ఎమ్మేల్యే కొర‌ముట్ల‌ శ్రీనివాస్ మాట్లాడారు. చంద్రబాబుకు ఓట‌మీ భ‌యం ప‌ట్టుకుంద‌ని అన్నారు. అందుకే తాము ఎమీ మాట్లాడిన ఉలిక్కిపడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీ నెర‌వేర్చ‌మ‌ని అడినందుకే, టీడీపీ శ్రేణులు జ‌గ‌న్ దిస్టి బోమ్మ‌ల‌ను కాల్చుతారా అని ఆయ‌న ప్ర‌శ్నించారు. జ‌గ‌న్ గురించి అసేంబ్లీలో ఎం మాట్లాడారో ఒక సారి గుర్తు చేసుకొవాల‌న్నారు. నంద్యాల్లో టీడీపీ కి ఓటమీ త‌ప్ప‌ద‌ని ఆయ‌న ఎద్దేవా చేశారు.

PREV
click me!

Recommended Stories

Minister Atchannaidu: అరసవల్లిలో ఆదిత్యుని శోభాయాత్రను ప్రారంభించిన అచ్చెన్నాయుడు| Asianet Telugu
CM Chandrababu Naidu: నగరిలోని హాస్టల్ లో నెట్ జీరో విధానం పరిశీలించిన సీఎం | Asianet News Telugu