వివాదంలో తిరుపతి లడ్డూ ప్రసాదం

By telugu news teamFirst Published May 21, 2020, 12:06 PM IST
Highlights

ఇరవై ఐదు రూపాయలకి లడ్డు అందించడం అంటే వన్ ప్లస్ వన్ స్కీమ్ లాంటిదని.. శ్రీ వారి లడ్డు ప్రతిష్ఠను దిగజార్చవద్దని సనాతన ధర్మ పరిరక్షణ సమితి నేతలు చెబుతున్నారు.

తిరుమల తిరుపతి దేవ స్థానం లడ్డూ వివాదంగా మారింది. లాక్ డౌన్ లోనూ తిరుమల లడ్డూని తయారు చేసి తక్కువ ధరకు అందిస్తున్న సంగతి తెలిసిందే.  కేవలం తిరుపతిలోనే కాకుండా ఇతర ప్రాంతాల్లోనూ లడ్డూలను సరఫరా చేస్తామని ఇటీవల ప్రకటించారు. కాగా.. దీనిపై అభ్యంతరాలు వ్యక్తమౌతున్నాయి.

ఇరవై ఐదు రూపాయలకి లడ్డు అందించడం అంటే వన్ ప్లస్ వన్ స్కీమ్ లాంటిదని.. శ్రీ వారి లడ్డు ప్రతిష్ఠను దిగజార్చవద్దని సనాతన ధర్మ పరిరక్షణ సమితి నేతలు చెబుతున్నారు. ఆలయాలు ఉన్నచోటనే గతంలో కూడా లడ్డూలను విక్రయించారు. కల్యాణ మండపాలలో జిల్లా కేంద్రాల్లో శ్రీవారి లడ్డూలు విక్రయించడం అంటే ప్రసాదాన్ని అవమానిండమేనని వాపోతున్నారు. జిల్లా కేంద్రాల్లో లడ్డూలు ఇస్తుంటే దళారీలు ప్రవేశించి లడ్డూలన్నీ బ్లాక్ మార్కెట్ చేస్తే టీటీడీ అడ్డుకోగలదా? అనిప్రశ్నించారు.

తిరుమలలోనే దళారీ వ్యవస్థను అడ్డుకోలేని టీటీడీకి జిల్లా కేంద్రాల్లోని కల్యాణ మండపంలో దళారీ వ్యవస్థను అడ్డుకునే శక్తి ఉంటుందా? అని సనాతన ధర్మ పరిరక్షణ సమితి నేతలు ప్రశ్నిస్తున్నారు. జిల్లా కేంద్రాల్లో కల్యాణ మండపాల్లో లడ్డూలు సామాన్యులు చేతికి అందవని.. తద్వారా శ్రీవారి భక్తులు తీవ్ర ఆవేదనకు గురి అవడం తప్ప మరో ప్రయోజనం లేదన్నారు. లడ్డూలను జిల్లా కేంద్రాల్లో కల్యాణ మండపాల్లో విక్రయించి శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బ తీయడం టీటీడీ చైర్మన్‌కు తగదని సనాతన ధర్మ ప్రచార సేవా సమితి నేతలు సూచించారు

click me!