ఇద్దరూ...ఇద్దరే... చెమటలు పట్టిస్తున్నారు

Published : Jul 25, 2017, 07:07 AM ISTUpdated : Mar 25, 2018, 11:56 PM IST
ఇద్దరూ...ఇద్దరే... చెమటలు పట్టిస్తున్నారు

సారాంశం

మంగళగిరి నియో వైసీపీ ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి చంద్రబాబును లీగల్ గా ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే రాజమండ్రి లోక్ సభ మాజీ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ తన వాగ్దాటితో చంద్రబాబుపై విరుచుకుపడుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎంఎల్ఏ సుమారు 35 కేసులు వేసుంటారు. భూములన్నింటినీ కోర్టు ఆదేశాల ప్రకారం ప్రత్యర్ధి అయిన ఆళ్ళకే వదులుకోవాల్సి రావటం ప్రభుత్వానికి మరింత అవమానం. ఉండవల్లి విషయం చూస్తే చంద్రబాబు ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై విరుచుకుపడుతున్నారు.

రాష్ట్రంలోని ఇద్దరు రాజకీయనేతలు చంద్రబాబునాయుడుకు చెమటలు పట్టిస్తున్నారు. వారిలో ఒకరు చంద్రబాబును లీగల్ గా గుక్కతిప్పుకోకుండా చేస్తుంటే ఇంకోరు లాపాయింట్లతోనూ, లాజిక్కులతోను వాయించేస్తున్నారు. వారెవరో ఈపాటికే అర్ధమైపోయుంటుంది. మంగళగిరి నియో వైసీపీ ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి చంద్రబాబును లీగల్ గా ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే రాజమండ్రి లోక్ సభ మాజీ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ తన వాగ్దాటితో చంద్రబాబుపై విరుచుకుపడుతున్నారు.

చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి ఇప్పటి వరకూ ఏ అంశంమీదైనా కానీండి  ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎంఎల్ఏ సుమారు 35 కేసులు వేసుంటారు. అందులో ఎక్కువభాగం రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వం చేస్తున్న బలవంతపు భూ సమీకరణకు వ్యతిరేకంగానే ఉన్నాయి. రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వానికి భూములు ఇవ్వటానికి ఇష్టపడని రైతుల తరపున వేసిన కేసులే ఎక్కువున్నాయి.  ప్రభుత్వ నిర్ణయాలు అమలు కాకుండా చాలా కేసుల్లో హైకోర్టు లేదా సుప్రింకోర్టు దాకా వెళ్ళి ఎంఎల్ఏ స్టేలు పొందిన విషయం అందరూ చూస్తున్నదే.

ఇక, సదావర్తి సత్రం భూకుంభకోణం విషయమైతే చెప్పనే అక్కర్లేదు కదా? వందల కోట్ల రూపాయలు విలువైన 84 ఎకరాల సత్రం భూములను చంద్రబాబు తన మద్దతుదారులకు కారుచౌకగా రాసిచ్చేయటాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో ఎంఎల్ఏ వేసిన కేసుతో ప్రభుత్వానికి తల బొప్పి కట్టింది. ప్రభుత్వం కోర్టులో ఎన్ని మాటలు చెప్పినా చివరకు ఆ భూములు వదులుకోవాల్సి వచ్చిందనేది వాస్తవం. పైగా ఆ భూములన్నింటినీ కోర్టు ఆదేశాల ప్రకారం ప్రత్యర్ధి అయిన ఆళ్ళకే వదులుకోవాల్సి రావటం ప్రభుత్వానికి మరింత అవమానం.

ఇక, ఉండవల్లి విషయం చూస్తే చంద్రబాబు ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై విరుచుకుపడుతున్నారు. పోలవరం, పట్టిసీమ, పురుషోత్తమపట్నం ప్రాజెక్టులు కావచ్చు, వెలగపూడిలో నిర్మించిన తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ నాసిరకం భవనాల నిర్మాణంలో జరిగిన అవినీతీ కావచ్చు. చంద్రబాబు పాలనలోని లొసుగులను ఎప్పటికప్పుడు తనదైన శైలిలో ఎత్తిచూపుతూ లాజిక్కులతో విరుచుకుపడటం ఉండవల్లి స్టైల్.

చక్కటి వాగ్దాటి, విషయం పరిజ్ఞానంతో ప్రత్యర్ధులను గుక్కతిప్పుకోనీయకుండా చేయగల సమర్ధుడు ఉండవల్లి. అందుకు తాజాగా జరిగిన బుచ్చయ్యచౌదరి వ్యవహారమే ఉదాహరణ. పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులపై బహిరంగచర్చకు సై అంటే సై అనుకున్నారు ఉండవల్లి-బుచ్చయ్యచౌదరి. తీరా చర్చ జరుగుతుందనుకునే సమయంలో పరువు నిలుపుకోవటానికి ప్రభుత్వం పోలీసులను రంగంలోకి దింపి చర్చను ఏ విధంగా పక్కదారి పట్టించిందీ అందరూ చూసిందే. ఈ విధంగా చంద్రబాబుకు అటు ఆళ్ళ ఇటు ఉండవల్లి ఇద్దరూ చెమటలు పట్టిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

YCP Leaders Submit Petition to DGP Office Seeking Justice in Salman MurderCase | Asianet News Telugu
Vidadala Rajini Serious: పోలీసులే ఈ హత్యలు చేయిస్తున్నారు | Salman Murder Case | Asianet News Telugu