Latest Videos

ఏపీ మంత్రులు వీరే... జనసేన, బీజేపీకి ఎన్ని పదవులు వచ్చాయంటే..?

By Galam Venkata RaoFirst Published Jun 12, 2024, 7:13 AM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ లో మరికాసేపట్లో టీడీపీ-జనసేన-బీజేపీ ప్రభుత్వం కొలువుదీరనుంది. ముఖ్యమంత్రిగా నాలుగో సారి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు మంత్రులు కూడా ప్రమాణం చేశారు. మూడు పార్టీల నుంచి ఎవరెవరికి మంత్రి పదవులు దక్కాయంటే...?

మరికాసేపట్లో నాలుగోసారి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణం స్వీకారం చేశారు. క్రిష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి ఐటీ పార్కు సమీపంలో చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది. చంద్రబాబుతో పాటు 24 మంది మంత్రులు కూడా ప్రమాణం చేశారు. వీరితో గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రమాణం చేయించారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, బీజేపీ, టీడీపీ, జనసేన ముఖ్య నాయకులు, పలువురు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. చంద్రబాబు కేబినెట్‌లో జనసేనతో పాటు బీజేపీ ఎమ్మెల్యేలకు ప్రాధాన్యం దక్కింది. ఇంతకీ వర్గంలో ఎవరెవరికి చోటు దక్కిందంటే...?

1.     నారా చంద్రబాబు నాయుడు - ముఖ్యమంత్రి
2.    కొణిదెల పవన్ కళ్యాణ్ (జనసేన)
3.    కింజరాపు అచ్చెన్నాయుడు (టీడీపీ)
4.    కొల్లు రవీంద్ర (టీడీపీ)
5.    నాదెండ్ల మనోహర్ (జనసేన)
6.    పి.నారాయణ (టీడీపీ)
7.    వంగలపూడి అనిత (టీడీపీ)
8.    సత్యకుమార్ యాదవ్ (బీజేపీ)
9.    నిమ్మల రామానాయుడు (టీడీపీ)
10.    ఎన్.ఎమ్.డి.ఫరూక్ (టీడీపీ)
11.    ఆనం రామనారాయణరెడ్డి (టీడీపీ)
12.    పయ్యావుల కేశవ్ (టీడీపీ)
13.    అనగాని సత్యప్రసాద్ (టీడీపీ)
14.    కొలుసు పార్థసారధి (టీడీపీ)
15.    డోలా బాల వీరాంజనేయస్వామి (టీడీపీ)
16.    గొట్టిపాటి రవి (టీడీపీ)
17.    కందుల దుర్గేష్ (జనసేన)
18.    గుమ్మడి సంధ్యారాణి (టీడీపీ)
19.    బీసీ జనార్దన్ రెడ్డి (టీడీపీ)
20.    టీజీ భరత్ (టీడీపీ)
21.    ఎస్.సవిత (టీడీపీ)
22.    వాసంశెట్టి సుభాష్ (టీడీపీ)
23.    కొండపల్లి శ్రీనివాస్ (టీడీపీ) 
24.    మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి (టీడీపీ) 
25.    నారా లోకేష్ (టీడీపీ) 

కాగా, చంద్రబాబు కేబినెట్లో జనసేనకు 4, బీజేపీకి రెండు పదవులు దక్కుతాయని తొలుత అందరూ భావించారు. అయితే అలా జరగలేదు. జనసేనకు మూడు మంత్రి పదవులు, బీజేపీకి ఒకటి మాత్రమే దక్కాయి. జనసేన నుంచి పవన్ కల్యాణ్ తో పాటు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్, బీజేపీ నుంచి సత్యకుమార్ కు చంద్రబాబు మంత్రివర్గంలో చోటు దక్కింది.

click me!